ఎన్టీఆర్ బర్త్‌డే కౌంట్ డౌన్ స్టార్ట్

రాబోయే తారక్ బర్త్‌డే కోసం, ఫ్యాన్స్ ఇప్పటినుండే ట్విట్టర్‌లో హంగామా మొదలు పెట్టేసారు.

  • Published By: sekhar ,Published On : January 29, 2019 / 07:45 AM IST
ఎన్టీఆర్ బర్త్‌డే కౌంట్ డౌన్ స్టార్ట్

రాబోయే తారక్ బర్త్‌డే కోసం, ఫ్యాన్స్ ఇప్పటినుండే ట్విట్టర్‌లో హంగామా మొదలు పెట్టేసారు.

హ్యాపీ బర్త్‌డే యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 న కదా.. అప్పుడే విష్ చెయ్యడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా? రాబోయే తారక్ బర్త్‌డే కోసం, ఫ్యాన్స్ ఇప్పటినుండే ట్విట్టర్‌లో హంగామా మొదలు పెట్టేసారు. అడ్వాన్స్ బర్త్‌డే ట్రెండ్స్ పేరుతో, డేస్ కౌంటింగ్‌తో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసారు యంగ్ టైగర్ ఫ్యాన్స్. ఫిబ్రవరి 9 నుండి మే 20 వరకు 100 డేస్ అనీ, మార్చ్ 31 నుండి మే 20 వరకు 50 డేస్ అని కరెక్ట్ కౌంటింగ్‌తో, ఫోటోషాప్‌లో రకరకాల ఫోటోలను డిజైన్ చేసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు అభిమానులు. అరవింద సమేతతో సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు. తారక్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 2020లో ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశం ఉంది.