NTR: వార్ కోసం డేట్స్ ఫిక్స్ చేసుకున్న తారక్.. నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్-2’లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మూడు నెలల డేట్స్ ఇచ్చాడట ఈ స్టార్ హీరో.

NTR: వార్ కోసం డేట్స్ ఫిక్స్ చేసుకున్న తారక్.. నిజమేనా?

NTR Allocates Three Months For War 2 Movie

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, తారక్ బాలీవుడ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్-2’ రాబోతున్న సంగతి తెలిసిందే.

NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!

ఈ సీక్వెల్ మూవీలో హృతిక్‌తో పాటు తారక్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కాగా, ఈ సినిమా కోసం తారక్ తాజాగా డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వార్-2 మూవీ కోసం ఏకంగా మూడు నెలల పాటు డేట్స్ ఇచ్చాడట యంగ్ టైగర్. ప్రస్తుతం ఆయన చేస్తున్న NTR30 మూవీని అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ముగించేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

NTR 30 : షూటింగ్ లో జాయిన్ అయిన సైఫ్ అలీఖాన్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన NTR 30

ఆ తరువాత డిసెంబర్‌లో వార్-2 మూవీలో తారక్ జాయిన్ అవుతాడట. మూడు నెలల తరువాత మార్చి 2024లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీని స్టార్ట్ చేసేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట. మరి నిజంగానే తారక్ వార్-2 కోసం మూడు నెలల డేట్స్ ఇచ్చాడా అనే విషయం అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.