NTR and Pawan Kalyan: ఒకే ఫ్రేమ్‏లో జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్

ఆగిపోయిన కలానికి అశ్రు నివాళులర్పించేందుకు సినీ లోకం దిగొచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహానికి పూలగుచ్ఛం సమర్పించి బాధతప్త హృదయంతో నివాళులర్పించారు.

NTR and Pawan Kalyan: ఒకే ఫ్రేమ్‏లో జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్

Sirivennela S

NTR and Pawan Kalyan; ఆగిపోయిన కలానికి అశ్రు నివాళులర్పించేందుకు సినీ లోకం దిగొచ్చింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివ దేహానికి పూలగుచ్ఛం సమర్పించి బాధతప్త హృదయంతో నివాళులర్పించారు. బుధవారం ఉదయం ఫిలిం ఛాంబర్ లో ఉంచడంతో సినీ ప్రముఖులు తరలిరాగా.. ఎన్టీఆర్ వచ్చిన సమయానికే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారు.

చిన్న మామయ్య భౌతిక కాయం దగ్గరే నిల్చొన్న త్రివిక్రమ్ ను పరామర్శించి కాసేపు ఎన్టీఆర్ మౌనంగా ఉండిపోయారు. ఆయన పక్కన త్రివిక్రమ్.. అతని వెనుక పవన్ కళ్యాణ్ కాసేపటి వరకూ అలాగే ఉన్నారు. ఇలా ముగ్గురు ఒకే ఫ్రేములో కనిపించారు. స్తంభించిపోయిన ఎన్టీఆర్ కాసేపటికి కదిలి ముందుకు వెళ్లిపోగా పవన్ కళ్యాణ్ అక్కడే ఉండిపోయారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్… ‘ “కొన్నిసార్లు మన ఆవేదన, బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావు. అలాంటి మాటలనే ఆ మహానుభావుడే తన కలంతో వ్యక్తపరచాలి. నా ఆవేదనను కూడా ఆయన కలంతోనే ఆయనే వ్యక్తపరిస్తే బాగుండేది. ఆయన కలం ఆగినా.. ఆయన రాసిన మాటలు, పాటలు, సాహిత్యం… తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం చిరస్మరణీయంగా బతికే ఉంటుంది. రాబోయే తరానికి ఆ సాహిత్యం బంగారు బాట వేయాలి. తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎల్లపుడూ ఉండాలి అని కోరుకుంటున్నా” అని అన్నారు.

…………………………………: నా ఏడుపును ఆయన కలమే వర్ణించాలి.. ఎన్టీఆర్ బాధ వెనుక కథ ఇదీ!