NTR – Charan : హాలీవుడ్ స్టార్స్‌ని వెనక్కి నెట్టి ముందు స్థానంలో నిలిచిన ఎన్టీఆర్, చరణ్..
టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం RRR. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ పురస్కారాలు జరుగుతున్న రోజున సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యిన టాప్ 5 లిస్ట్ ని ప్రముఖ అమెరికన్ మార్కెట్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో..

NTR – Charan : టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన మల్టీస్టార్రర్ చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఒక తెలుగు సినిమాకి మన నేషనల్ లెవెల్ లోనే గుర్తింపు లేని స్టేజి దగ్గర నుంచి, నేడు ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా తెలిసేలా రాజమౌళి చేశాడు. ఇక తెలుగు వాడి ఊహల్లో కూడా లేని ఆస్కార్ ని కూడా గెలుచుకొని, ఆస్కార్ అందుకున్న మొదట ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది.
95th Oscar Winners : 95వ ఆస్కార్ అవార్డు గ్రహీతలు..
మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ పురస్కారాలు జరుగుతున్న రోజున సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యిన టాప్ 5 లిస్ట్ ని ప్రముఖ అమెరికన్ మార్కెట్ ఇంటలిజెన్స్ ప్లాట్‌ఫార్మ్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో దాదాపు 24 గంటల పాటు ట్రెండ్ అయ్యి హాలీవుడ్ స్టార్స్‌ని వెనక్కి నెట్టి మన సినిమాలు, మన స్టార్స్ ముందు స్థానాల్లో నిలిచారు. టాప్ 5 మూవీస్ లిస్ట్ లో.. మొదటి స్థానంలో RRR నిలవగా, రెండో స్థానంలో ఆస్కార్ గెలుచుకున్న మన ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో Everything Everywhere All at Once, All Quiet on the Western Front, Argentina చిత్రాలు నిలిచాయి.
Oscar 2023 : ఆస్కార్ వేదికపైకి గాడిదని తీసుకొచ్చిన యాంకర్.. ఆ గాడిద ప్రత్యేకత ఏంటో తెలుసా??
ఇక యాక్టర్స్ విషయానికి వస్తే.. టాప్ 5 లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ఎన్టీఆర్, సెకండ్ ప్లేస్ రామ్ చరణ్ నిలిచి.. వారి ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, ఇండియన్స్ ని కూడా గర్వపడేలా చేశారు. దీంతో ఎన్టీఆర్ అండ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. వీరిద్దరి తరువాత Ke Huy Quan, Brendan Fraser, Pedro Pascal లిస్ట్ లో స్థానం దక్కించుకున్నారు. ఇక యాక్ట్రెస్ విషయానికి వస్తే.. Michelle Yeoh, Lady Gaga, Angela Bassett, Elizabeth Olsen, Jamie Lee Curtis టాప్ 5 లిస్ట్ లో నిలిచారు.
More top mentions from #Oscars95 across social & news media…
Top 5 Mentioned Actresses:
1. #MichelleYeoh
2. #LadyGaga
3. #AngelaBassett
4. #ElizabethOlsen
5. #JamieLeeCurtisTop 5 Mentioned Actors:
1. #NTR
2. #RamCharan
3. #KeHuyQuan
4. #BrendanFraser
5. #PedroPascal pic.twitter.com/ymh6Qrh4Ob— NetBase Quid (@NetBaseQuid) March 13, 2023
As the #Oscars continue to trend today, we’re sharing some top mentions across social and news media over the past 24-hours!
Top 5 Mentioned Films:
1. #RRRMovie
2. #TheElephantWhisperers
3. #EverythingEverywhereAllAtOnce
4. #AllQuiteontheWesternFront
5. #Argentina1985— NetBase Quid (@NetBaseQuid) March 13, 2023