NTR : సల్మాన్‌ని పక్కన పెట్టి ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా యాడ్.. అది ఎన్టీఆర్ రేంజ్ అంటున్న అభిమానులు..

RRR చిత్రంతో ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ ఫేమ్ ని పలు సంస్థలు తమ బ్రాండ్ కి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ (Salman Khan) ని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో..

NTR : సల్మాన్‌ని పక్కన పెట్టి ఎన్టీఆర్‌తో పాన్ ఇండియా యాడ్.. అది ఎన్టీఆర్ రేంజ్ అంటున్న అభిమానులు..

NTR Salman Khan appy fizz

NTR : రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ (NTR) నటనకు ముగ్దులు అయ్యిపోయారు. నాటు నాటు పాట ఆస్కార్ కూడా అందుకోవడంతో ప్రస్తుతం RRR పేరు, ఆ సినిమాకి సంబంధించిన వ్యక్తులు పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ అండ్ చరణ్ (Ram Charan)కి గ్లోబ్ స్థాయిలో భారీ పాపులారిటీ లభించింది. ఇక ఈ ఫేమ్ ని పలు సంస్థలు తమ బ్రాండ్ కి ఉపయోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ ఆపీ ఫిజ్ (Appy Fizz) పాన్ ఇండియా యాడ్ ని చిత్రీకరించారు.

NTR30: తుఫాను హెచ్చరిక.. మార్చి 23న తారక్ విధ్వంసానికి ముహూర్తం పెట్టిన కొరటాల!

గతంలో ఎన్టీఆర్ ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. అయితే అప్పుడు తెలుగు బాషకి మాత్రమే వ్యవహరించాడు. కాగా ఇప్పుడు RRR తో ఎన్టీఆర్ కి వచ్చిన ఫేమ్ ని దృష్టిలో పెట్టుకొని మొత్తం 6 భాషలకి ఎన్టీఆర్ నే బ్రాండ్ అంబాసిడర్ గా ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, ఉర్దూ భాషల్లో ఎన్టీఆర్ పై ఈ యాడ్ ని చిత్రీకరించారు. ఈ యాడ్ లో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) కూడా నటించింది. గతంలో ఆపీ ఫిజ్ హిందీకి సల్మాన్ ఖాన్ (Salman Khan) బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు.

Jr NTR About Oscar Award : RRRకు ఆస్కార్ రావడానికి అభిమానులే కారణం

బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ని పక్కన పెట్టి ఎన్టీఆర్ తో హిందీ ఆపీ ఫిజ్ యాడ్ చేయించడంతో.. ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, NTR30 మూవీ ఈ నెల 23న మొదలు కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Jahnavi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)