NTR: బాలీవుడ్‌లో బాంబులు వెలిగించి సౌండ్ చేయబోతున్న తారక్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘వార్’ సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. వార్-2 సినిమా షూటింగ్‌ను దీపావళికి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.

NTR Bollywood Debut Movie To Start At This Time
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే, ఇటీవల తారక్ బాలీవుడ్ ఎంట్రీ కన్ఫం అయినట్లుగా వార్తలు వచ్చాయి.
NTR – Hrithik Roshan : హృతిక్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్.. స్పై యూనివర్స్‌లోకి యంగ్ టైగర్!
బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘వార్’ సీక్వెల్ చిత్రంలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాతో తారక్ సాలిడ్ డెబ్యూ ఇవ్వనున్నాడని సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు తారక్ కలిసి నటించనున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయనున్నాడు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
NTR: తారక్‌తో మూవీపై వెట్రిమారన్ కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?
వార్-2 సినిమా షూటింగ్‌ను దీపావళికి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈలోపు తారక్ తన 30వ చిత్రాన్ని పూర్తి చేసుకుని, వార్-2 మూవీలో ఎంట్రీ ఇస్తాడట. ఈ సినిమాతో బాలీవుడ్‌లో తారక్ తన సత్తా చాటడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.