NTR30: ఏడాది తరువాత సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చిన టైగర్.. విధ్వంసానికి యాక్షన్ షురూ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్, నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.

NTR30: ఏడాది తరువాత సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చిన టైగర్.. విధ్వంసానికి యాక్షన్ షురూ!

NTR Finally Joins NTR30 Shooting

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంచ్ చేసిన చిత్ర యూనిట్, నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కొరటాల అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

NTR30 : శ్రీరామనవమి కానుకగా NTR30 అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

ఇక ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ చాలా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు షూటింగ్ సెట్స్‌లో నేడు అడుగుపెట్టాడు. కొరటాల శివ సముద్రం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపెట్టబోతున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే మేకోవర్ చేస్తున్న తారక్, ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో తారక్ తనదైన విధ్వంసకరమైన నటనతో మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

NTR30: ఎన్టీఆర్ కోసం మరో బ్యూటీ దిగుతుందా.. క్లారిటీ ఇవ్వని కొరటాల!

ఈ సినిమాను మరింత ప్రెస్టీజియస్‌గా మారుస్తూ, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొస్తున్నాడు డైరెక్టర్ కొరటాల. వారితో పాటు పలువురు టాప్ టెక్నీషియన్లు ఇప్పటికే ఈ సినిమాకు వర్క్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో, తారక్-జాన్వీల కెమిస్ట్రీ వెండితెరపై ఎలాంటి రచ్చ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి.