తారక్.. లుక్ కిరాక్..

  • Published By: sekhar ,Published On : October 17, 2020 / 01:21 PM IST
తారక్.. లుక్ కిరాక్..

NTR Commercial Ad: యంగ్ టైగర్ NTR ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘RRR’ (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు తారక్. కొమరం భీమ్ జయంతి కానుకగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదల కాబోతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే సినిమా టీజర్ కంటే ముందు ఓ Commercial Ad తో అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు తారక్. యంగ్ టైగర్ ఇటీవల Appy Fizzషూటింగ్‌లో పాల్గొన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.


తాజాగా ఆ యాడ్‌కు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు తారక్. ఈ Be The Fizz వీడియోలో సరికొత్త లుక్‌లో కనిపించాడు జూనియర్. ఈ యాడ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తారక్ లుక్ కిరాక్ అంటూ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CGbsFRDDc95/?utm_source=ig_web_copy_link