NTR : నిన్న చరణ్.. నేడు ఎన్టీఆర్.. అమెరికా ఛానల్ లో ఇంటర్వ్యూ.. ఒక ఇండియన్ గా గర్విస్తాను అంటూ ఎన్టీఆర్..

అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. ఇన్ని రోజులు వరుసగా చరణ్ హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఇప్పుడు ఎన్టీఆర్ ఇస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌ అనే హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు...............

NTR : నిన్న చరణ్.. నేడు ఎన్టీఆర్.. అమెరికా ఛానల్ లో ఇంటర్వ్యూ.. ఒక ఇండియన్ గా గర్విస్తాను అంటూ ఎన్టీఆర్..

NTR Interview in hollywood media ntr comments on cinema and naatu naatu song

NTR :  ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా RRR యూనిట్ హాలీవుడ్ లోని పలు సినిమా ఈవెంట్స్ కి హాజరవుతూ, సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలోనే ఉండి ఆస్కార్ అయ్యేవరకు సందడి చేయనున్నారు. అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు. ఇన్ని రోజులు వరుసగా చరణ్ హాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వగా ఇప్పుడు ఎన్టీఆర్ ఇస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ టునైట్‌ అనే హాలీవుడ్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ RRR సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను తెలియచేసారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమా అనేది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా అని ఏం లేదు ఇప్పుడు. అన్ని సినిమాలు అన్ని చోట్ల ఆడుతున్నాయి. ఒకప్పుడు హాలిడేస్ కోసం లాస్ ఏంజిల్స్ కి వచ్చేవాడిని, ఇప్పుడు ఆస్కార్ కోసం వచ్చాను. వరల్డ్ సినిమా అంతా ఒక్కటే. ఆస్కార్ వేడుకల్లో నేను ఒక RRR యాక్టర్ గా కంటే, ఇండియన్ యాక్టర్ గా కంటే కూడా ఒక ఇండియన్ గా అడుగుపెడతాను. నా హృదయంలో నేను ఎప్పుడు ఇండియన్ గా గర్విస్తాను అని తెలిపారు. దీంతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది.

Ram Charan : నాటు నాటు పాట వల్ల నాలుగు కిలోల బరువు తగ్గాను.. రామ్ చరణ్

ఇక ఇదే ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఈ సాంగ్ షూట్ చేసినన్ని రోజులు సెట్ లో రిహార్సిల్ చేశాం. ఆ తర్వాత డైలీ మూడు గంటలు ప్రాక్టీస్ చేశాము. డ్యాన్స్ కంటే కూడా సింక్ కోసం ఎక్కువ ప్రాక్టీస్ చేశాము. నేను, చరణ్ స్టెప్స్ సింక్ చేయడానికి చాలా సమయం పట్టేది. ఈ సాంగ్ సమయంలో నా కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి అని తెలిపాడు ఎన్టీఆర్.