NTR: చికెన్ కోసం.. చంద్రుడిని సూర్యుడిగా మార్చిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మిత్రులతో కలిసి చికెన్ తినేందుకు ఓ చోటుకు వెళ్లారు. చికెన్ తినేందుకు సిద్దం అయ్యారు. ఇంతలో అక్కడకు ఓ మేనేజర్ వచ్చాడు.

NTR McDonalds Ad
NTR McDonald’s: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మిత్రులతో కలిసి చికెన్ తినేందుకు ఓ చోటుకు వెళ్లారు. చికెన్ తినేందుకు సిద్దం అయ్యారు. ఇంతలో అక్కడకు ఓ మేనేజర్ వచ్చాడు. సారీ సార్ ఇది క్లోజింగ్ టైమ్ అని చెబుతూ తన చేతికి ఉన్న గడియారాన్ని చూపించాడు. వెంటనే ఎన్టీఆర్ కు ఓ సూపర్ ఆలోచన వచ్చింది. అగ్గిపెట్టె అందుకుని అందులోంచి ఓ అగ్గి పుల్లను వెలిగించాడు. దాన్ని చంద్రుడికి అంటించాడు. ఇంకేముంది చంద్రుడు కాస్త సూర్యుడిగా మారిపోయాడు. వెంటనే ఇది ఓపెనింగ్ టైమ్ అంటూ యంగ్ టైగర్ చెప్పాడు. అందరూ కలిసి చికెన్ తిన్నారు. ఇది ఏదో సినిమాలోని ఓ సీన్ అనుకోకండి మెక్ డొనాల్డ్స్ కొత్త యాడ్.
Megha Akash: పీకల్లోతు ప్రేమలో మేఘా ఆకాశ్.. త్వరలోనే పెళ్లి..? వరుడు అతడేనంట..?
ఈ యాడ్‌లో ఎనీఆర్ట్ కనిపించి అలరించాడు. ఇక యాడ్ చివరల్లో ‘మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్.. స్పైసీని మీరు వివరించలేరు..షేర్ చేసుకోవాలి’ అంటూ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడంతో యాడ్ ముగుస్తోంది. ఈ రోజే విడుదలైన ఈ యాడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా.. దీనిపై నెటీజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. చికెన్ కోసం చంద్రుడిని సూర్యుడిగా మార్చావా అన్నా.. నీకే సాధ్యం కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఫుడ్‌కు సంబంధించిన యాడ్స్ చేయడం ఎన్టీఆర్‌కు ఇదేం కొత్త కాదు. గతంలో ‘లీషియస్’, ‘యాపీ ఫిజ్’ యాడ్స్‌లో కూడా చేశారు.
Sara Ali Khan: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన సారా అలీఖాన్
ఇక సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో జాన్వీకి ఇదే తొలి చిత్రం. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడు. అంతేకాకుండా హృతిక్ రోషన్ నటిస్తున్న ‘వార్ ‘2 సినిమాలోనూ నటించనున్నారు.