NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేసి అభిమానులకు కావాల్సినంత స్టఫ్ అందించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్‌గా....

NTR: ఎన్టీఆర్ ఆ డైరెక్టర్‌కు హ్యాండిచ్చాడుగా..?

Ntr Left Buchi Babu In Dilemma

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేసి అభిమానులకు కావాల్సినంత స్టఫ్ అందించాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన తరువాత తారక్ ఎవరితో సినిమాలు చేస్తాడా అనే ఉత్కంఠకు తెరదించుతూ, తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో, అటుపై తన 31వ చిత్రాన్ని కేజీయఫ్ లాంటి భారీ మూవీని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ తారక్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాను షేక్ చేశాయి.

NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?

అయితే తారక్ పుట్టినరోజు కానుకలతో అందరూ సంతోషంగా ఉంటే, ఓ డైరెక్టర్ మాత్రం అయోమయంలోకి వెళ్లిపోయాడు. ఇంతకీ తారక్ తన నెక్ట్స్ చిత్రాలను అనౌన్స్ చేస్తే, అయోమయంలో పడ్డ ఆ డైరెక్టర్ ఎవరని అనుకుంటున్నారా.. ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా తన సత్తా చాటిన బుచ్చిబాబు సానా తన నెక్ట్స్ చిత్రాన్ని తారక్‌తో తెరకెక్కించాలని చాలా గట్టిగానే ప్రయత్నించాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఓ కథను కూడా ఎన్టీఆర్‌కు ఆయన వినిపించాడని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా వినిపించింది. ఇక ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడట ఈ డైరెక్టర్.

NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!

ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను తారక్ పుట్టినరోజున ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ.. తారక్ మాత్రం కేవలం కొరటాల శివ, ప్రశాంత్ నీల్ చిత్రాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ మాత్రమే ఇచ్చి బుచ్చిబాబుకు షాకిచ్చాడు. దీంతో ఈ డైరెక్టర్ డైలమాలో పడిపోయాడు. మరి తారక్‌తో సినిమా ప్లాన్ చేసిన బుచ్చిబాబు ఇప్పుడు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్టీఆర్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసే వరకు మరో రెండేళ్ల సమయం పడుతుంది. రెండేళ్లు కేవలం తారక్ కోసం వెయిట్ చేయడం బుచ్చిబాబు లాంటి అప్‌కమిండ్ డైరెక్టర్ ఏమాత్రం మంచిది కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.

పోనీ వేరే స్టార్ హీరోలతో ఈ సినిమాను చేద్దామని చూసినా, ప్రస్తుతం అందరూ తమ నెక్ట్స్ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయారు. మరి బుచ్చిబాబు తన నెక్ట్స్ మూవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తారక్ బుచ్చిబాబుకు హ్యాండిచ్చాడుగా అని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.