NTR30: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందా.. అందుకేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోని 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాను లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి తారక్ కన్నేశాడా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అవుతున్నాయి. ఈ సినిమాతో తారక్-కొరటాల కాంబినేషన్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ రావడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను కొరటాల పవర్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుపడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

NTR 30 : భారీగా NTR30 ఓపెనింగ్.. రాజమౌళి, ప్రశాంత్ నీల్.. అనేక మంది సినీ ప్రముఖుల సమక్షంలో..

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాతోనే తారక్ తన బాలీవుడ్ ఎంట్రీపై కన్నేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. NTR30 చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ హాజరుకావడంతో, అందరి చూపులు ఆయనపై పడ్డాయి.

NTR30: తుఫాను హెచ్చరిక.. మార్చి 23న తారక్ విధ్వంసానికి ముహూర్తం పెట్టిన కొరటాల!

తారక్‌తో ఆయన త్వరలోనే ఓ భారీ ప్రాజెక్టును చేయబోతున్నాడా అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్టులను లైనప్ చేసిన భూషణ్ కుమార్, ఎన్టీఆర్ లాంటి మల్టీ ట్యాలెంటెడ్ హీరోతో సినిమా చేస్తే, ఆ సినిమా నెక్ట్స్ లెవెల్‌లో ఉండటం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే NTR30 చిత్రాన్ని బాలీవుడ్‌లో భూషణ్ కుమార్ రిలీజ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు