NTR: ప్రశాంత్ నీల్‌తో మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..? | NTR Prashanth Neel Movie To Start From Dasara

NTR: ప్రశాంత్ నీల్‌తో మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి యాక్ట్ చేసిన తారక్, ప్రేక్షకులతో పాటు విమర్శకుల....

NTR: ప్రశాంత్ నీల్‌తో మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో చెలరేగిపోయి యాక్ట్ చేసిన తారక్, ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, ప్రస్తుతం తన కెరీర్‌లోని 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే, తారక్ కెరీర్‌లో 31వ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Jr NTR-Prasanth Neel: తారక్, ప్రశాంత్ వైరల్ పిక్.. సెలబ్రేషన్ అసలు రీజన్ ఏంటంటే?

ఇప్పటికే ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నాడనే వార్త కన్ఫమ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీని దసరా సందర్భంగా అధికారికంగా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దసరా వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుందని, అటు ప్రశాంత్ నీల్ సలార్ ప్రాజెక్ట్ కూడా దగ్గరపడుతుందని తారక్ భావిస్తున్నాడట. ఇక దసరాకు లాంఛ్ చేసి, ఈ ప్రాజెక్టును దసరా 2024 నాటికి రిలీజ్ చేయాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడట.

NTR: రెడీ ఫర్ చేంజ్ అంటోన్న ఎన్టీఆర్!

ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో పాటు భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో తారక్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంటుందని, అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ఈ సినిమాను దసరాకు లాంఛ్ చేస్తారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

×