Simhadri Re Release : సింహాద్రి రీ రిలీజ్ అయ్యేది అప్పుడే.. అనౌన్స్‌మెంట్ వీడియో అదిరిపోయింది!

ఎన్టీఆర్ (NTR), రాజమౌళి (Rajamouli) కలయికలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మూవీ సింహాద్రి. ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని ఆకాశంలో విమానంతో చాలా గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.

Simhadri Re Release : సింహాద్రి రీ రిలీజ్ అయ్యేది అప్పుడే.. అనౌన్స్‌మెంట్ వీడియో అదిరిపోయింది!

NTR Rajamouli Simhadri re released on ntr birthday may 20

Simhadri Re Release : మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం NTR30 సినిమాలో నటిస్తున్నాడు. ఒక కొత్త కథతో ఆడియన్స్ ని థ్రిల్ చేయబోతున్నాడు దర్శకుడు కొరటాల శివ. కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎన్టీఆర్ కి జంటగా నటిస్తుంది. RRR వంటి గ్లోబల్ హిట్టు తరువాత వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కంటే ముందు మరో ఇండస్ట్రీ హిట్ మూవీని ఎన్టీఆర్ అభిమానుల ముందుకు తీసుకు వస్తున్నారు మేకర్స్. 2003 లో రాజమౌళి, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సింహాద్రి.

NTR30: ఎన్టీఆర్ సినిమాపై కొత్త బజ్.. నిజంగానే అలాంటి పాత్ర ఉంటుందా..?

వీరిద్దరి కాంబినేషన్ లో అంతకముందు స్టూడెంట్ నెంబర్ 1 (Student No 1) అనే డీసెంట్ ఫిల్మ్ వచ్చి మంచి విజయం అందుకుంది. దాని తరువాత వచ్చిన సింహాద్రి యాక్షన్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి, బాలకృష్ణకి ఆ సినిమాతో ఎన్టీఆర్ గట్టి పోటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఏకంగా ఇండస్ట్రీ హిట్టుని అందుకొని సంచలనం సృష్టించింది. భూమిక, అనిత హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విజేత కీరవాణి అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. మరో ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ సినిమాకి నాలుగు పాటలు రాశాడు.

ముఖ్యంగా చంద్రబోస్ రాసిన ‘నువ్వు విజులేస్తే’ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాని తరువాత తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ చేశారు. కాగా ఈ సినిమాకి ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తాజాగా ఈ సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు ఈ చిత్రాన్ని 4K క్వాలిటీతో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని చాలా గ్రాండ్ గా ప్రకటించారు. విమానాతో ఆకాశంలో ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.