RRR: ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ ఫినిష్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్

యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’.

RRR: ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ ఫినిష్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్

Rrr Movie

RRR: యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా జనవరి 7, 2022న విడుదల కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తిగా.. లేటెస్ట్‌గా డబ్బింగ్ కూడా పూర్తి చేశారంట ఎన్టీఆర్, రామ్ చరణ్.

ఆర్ఆర్ఆర్‌లో కొమ్రం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. తెలంగాణ మన్యం వీరుడు కొమరం భీమ్, ఆంధ్రా మన్యం వీరుడు అల్లూరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ఇప్పటికే విడుదలవ్వగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరాకు గానీ, దీపావళికి గానీ, ఈ సినిమాకు సంబంధించి మరో సర్ ప్రైజ్ ఇవ్వనుందని చెబుతున్నారు.

భారీ అంచనాలతో మరో మూడు నెలల్లో థియేటర్స్‌లోకి రాబోతున్న ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్, జీ5 ఇప్పటికే దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ను జీ5, హిందీ, కొరియన్, పోర్చుగీస్, టర్కిష్, స్పానిష్ వెర్షన్స్‌ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.