Agent Movie: ఏజెంట్ కోసం బరిలోకి దిగుతున్న ఆర్ఆర్ఆర్ వీరులు..?
అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.

NTR Ram Charan To Come For Akhil Agent Movie Pre-Release Event
Agent Movie: అక్కినేని అఖిల్ నటిస్తున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
Agent Movie: ఏజెంట్ థియేట్రికల్ రైట్స్‌కు భారీ రేటు.. అయ్యగారితో మామూలుగా ఉండదు!
కాగా, ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను త్వరలోనే నిర్వహించాలని చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌కు ఆర్ఆర్ఆర్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను కలిపి గెస్టులుగా పిలవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
Agent Movie: ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకున్న ఏజెంట్
ఈ ఇద్దరు హీరోలు గనక నిజంగానే అఖిల్ ఏజెంట్ మూవీ కోసం వస్తే, అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఒకే వేదికపై మెగా, నందమూరి, అక్కినేని హీరోలను చూసే అవకాశం ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే అఖిల్ కోసం ఆర్ఆర్ఆర్ హీరోలు వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోండగా, మలయాళ స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 28న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.