NTR : RRR ఆస్కార్‌కి వెళ్లడం నా గొప్పతనం కాదు, అతని గొప్పతనం.. ఎన్టీఆర్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. ఫిబ్రవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది దీంతో చిత్ర యూనిట్ నిన్న (ఫిబ్రవరి 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..

NTR : RRR ఆస్కార్‌కి వెళ్లడం నా గొప్పతనం కాదు, అతని గొప్పతనం.. ఎన్టీఆర్!

ntr

NTR : నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘అమిగోస్’. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆషికా రంగ‌నాథ్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తుంది. బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ నిన్న (ఫిబ్రవరి 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది.

NTR Speech : NTR30 అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్..

హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్టేజి మీద మాట్లాడిన వారంతా మేము అమెరికా వెళ్ళాము, జపాన్ వెళ్ళాము, గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకున్నామని, ఇప్పుడు ‘నాటు నాటు’ సాంగ్ తో ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉన్నామని మా గురించి గొప్పగా చెబుతున్నారు. కానీ మీ అభిమానుల అందరి ఆశీర్వచనాలతోనే ఆస్కార్ దాకా మేము వెళ్ళాం. అలాగే ఇది నా గొప్పతనమో, చరణ్ గొప్పతనమో కాదు.. రాజమౌళి గొప్పతనం. ఇది మా జక్కన్న విజయం. RRR కి ఏ క్రెడిట్ వచ్చినా అది రాజమౌళికే దక్కాలి అంటూ వ్యాఖ్యానించాడు.

ఇక ఈ వేదిక పైనే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా అప్డేట్ కూడా ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యి నెలలు అవుతున్నా తన తదుపరి సినిమాని మొదలు పెట్టలేదు ఎన్టీఆర్. అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల అభిమానులు చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ నెలలోనే ఈ మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందని, మర్చి 20 లేదా అంతకంటే ముందే షూటింగ్ మొదలుపెడతామని, వచ్చే ఏడాది ఏప్రిల్ 5కి రిలీజ్ చేస్తామని తెలియజేశాడు.