NTR : ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఎలా చెప్పాడో తెలుసా?

ఎన్టీఆర్ కు అభిమానులు, ప్రముఖులు.. అంతా శుభాకాంక్షలు తెలపడంతో ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు.

NTR : ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ థ్యాంక్స్.. ఎలా చెప్పాడో తెలుసా?

NTR says Thank you to Fans for Birthday Wishes

NTR Birthday :  RRR తో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు ఎన్టీఆర్. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ఎన్టీఆర్ బాగా పాపులర్ అయ్యాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిన్న మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు అయితే ఎన్టీఆర్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సింహాద్రి సినిమాను కూడా రీ రిలీజ్ చేశారు.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమా టైటిల్ దేవర అని ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్ 31వ సినిమా మార్చ్ 2024 నుంచి షూట్ స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. అలాగే హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఉండబోతున్నాడు అని హింట్ ఇచ్చాడు. ఇన్ని అప్డేట్స్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషిస్తున్నారు.

Sreeleela : లక్కంటే శ్రీలీలదే.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఏకైక హీరోయిన్.. స్వయంగా చంద్రబాబుకు పరిచయం చేసిన బాలయ్య..

ఎన్టీఆర్ కు అభిమానులు, ప్రముఖులు.. అంతా శుభాకాంక్షలు తెలపడంతో ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు. ఇందులో.. కొన్ని సంవత్సరాలుగా సినీ కెరీర్ లో నేను అప్స్ అండ్ డౌన్స్ చూశాను. కానీ ఏం జరిగినా నా అభిమానులే నా వెన్నెముకగా, నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా, ప్రతి పాత్ర నా అభిమానుల కొరకే చేశాను. నన్ను నడిపిస్తున్నందుకు, నిజాయితీ గల అభిమానులుగా ఉంటున్నందుకు నా అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవర ఫస్ట్ లుక్ కి మీరు ఇచ్చిన స్పందనకు కృతజ్ఞతలు. ఈ రోజుని మారేంత స్పెషల్ గా మార్చిన నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శ్రేయాభిలాషులు, నా తోటి సినీ పరిశ్రమ వ్యక్తులందరికి ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ పోస్ట్ వైరల్ గా మారగా అభిమానులు ఈ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)