NTR: అతడిని చూస్తేనే పారిపోయే ఎన్టీఆర్.. అంతలా భయపెట్టేది ఎవరో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఓ వ్యక్తిని చూసి పారిపోతానని చెప్పడంతో, అసలు తారక్ ఎవరిని చూసి భయపడతాడా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు నెట్టింట తెగ వెతుకుతున్నారు.

NTR Scared Of His Son Abhay Ram
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే, అందులో ఒదిగిపోతాడు ఈ స్టార్ హీరో. ఇక రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా ఇటీవల స్టార్ట్ చేశాడు తారక్. అయితే ఆయన పర్సనల్ లైఫ్ విషయాలను ఎక్కువగా పంచుకునేందుకు ఇష్టపడరు.
కానీ, తాజాగా ఎన్టీఆర్ తాను ఓ వ్యక్తిని చూసి పారిపోతానని చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. తారక్ ఏమిటి.. ఓ వ్యక్తిని చూసి పారిపోవడం ఏమిటని ఆయన అభిమానులు నెట్టింట తెగ వెతుకుతున్నారు. అయితే.. తారక్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
NTR30: ఎన్టీఆర్ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్
తాను నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను తన ఫ్యామిలీతో కలిసి ఓ ప్రైవేట్ థియేటర్లో చూసినప్పుడు, తన ఎంట్రీ సీన్ చూసి తన తల్లి ‘‘ఎంత బాగా చేశావ్.. అంటూ మెచ్చుకొని నా పక్కన కూర్చొని సినిమా చూసింది’’ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఈ ఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని ఆయన తెలిపాడు.
NTR30: ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందా.. అందుకేనా?
ఇక తన ఫ్యామిలీలో తన కొడుకు అభయ్ రామ్‌ను చూసి తాను పారపోతానని.. అతడికి కనిపించకుండా ఉండేలా చూస్తానని తారక్ తెలిపాడు. అభయ్ రామ్‌కు తాను భయపడతానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ‘‘వాడు కొడుకు కాదు క్వశ్చన్ బ్యాంక్. ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నను బుర్రలో పెట్టుకొని తీరుగుతూ ఉంటాడు. వాడు అడిగిన ప్రశ్నలకు నేను చాలా ఓపికగా సమాధానాలు చెప్తూ ఉంటా.. ఒక్కోసారి వాడు అడిగే ప్రశ్నలు ఏంటో అస్సలు అర్ధం కాదు. ఆ సమయంలో వాడి నుంచి తప్పించుకొని పారిపోతాను.’’ అంటూ తారక్ తన కొడుకు అభయ్ రామ్ గురించి కామెంట్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.