NTR : ఫ్యాన్స్ ధాటికి తట్టుకోలేకపోతున్న హీరోలు.. అందుకే ఎన్టీఆర్ సీరియస్ అయ్యాడా?

NTR30 అప్డేట్ గురించి ఎన్టీఆర్ అభిమానులు, సలార్ గురించి ప్రభాస్ అభిమానులు, RC15 గురించి చరణ్ అభిమానులు, SSMB28 గురించి మహేష్ అభిమానులు.. ఇలా ప్రతి హీరో అభిమానులు తమ హీరో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి కొద్ది రోజుల్లో ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే అభిమానులు అప్డేట్ ఇవ్వండి అని రచ్చ...............

Movie updates :  తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ అంతా NTR30 అప్డేట్ గురించి అడిగారు. యాంకర్ సుమ కూడా NTR30 అప్డేట్ గురించి మాట్లాడటంతో ఎన్టీఆర్ మొదట సీరియస్ అయ్యారు. అనంతరం స్పీచ్ మాట్లాడిన తర్వాత ఈ అప్డేట్స్ విషయం గురించి మాట్లాడారు.

ఎన్టీఆర్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ అప్డేట్స్ విషయం పై మాట్లాడుతూ.. ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది. ఏది పడితే అది అప్డేట్ ఇవ్వలేము. ఏమన్నా అప్డేట్ ఉంటే మా ఇంట్లో భార్యకంటే కూడా ముందు మీకే చెప్తాము. అదిరిపోయే అప్డేట్ ఉంటే మాత్రమే చెప్తాము. నా పరిస్థితి మాత్రమే కాదు అందరి హీరోల పరిస్థితి ఇదే. ఇలా అప్డేట్స్ ఎవర్ని అడగకండి. ఎక్కడెక్కడో ఉన్న వార్తలు చదివి మీరు అడగొద్దు. ఏమన్నా ఉంటే మేమే చెప్తాము అని కొంచెం సీరియస్ గానే చెప్పారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ భారీ సినిమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వెళ్తుండటంతో హీరోల నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దీంతో అందరి హీరోల అభిమానులు సినిమాల అప్డేట్స్ కావాలని అడుగుతున్నారు. అయితే ఇది ఒక్కోసారి హద్దులు దాటుతుంది. కొంతమంది అభిమానులు తమ హీరో నెక్స్ట్ సినిమా అప్డేట్ కావాలని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఆ సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ పై కామెంట్స్ చేస్తూ అప్డేట్స్ ఇవ్వండి అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఒక్కోసారి శృతిమించుతోంది కూడా. అందుకే ఎన్టీఆర్ అలా రియాక్ట్ అయ్యాడని అందరూ భావిస్తున్నారు. ఎన్టీఆర్ చెప్పిన దాంట్లో కూడా 100 శాతం నిజమే ఉంది.

Sundeep Kishan : ఇప్పుడున్న రోజుల్లో రిలేషన్ షిప్ చాలా కష్టం.. నాకు అసలే బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది..

NTR30 అప్డేట్ గురించి ఎన్టీఆర్ అభిమానులు, సలార్ గురించి ప్రభాస్ అభిమానులు, RC15 గురించి చరణ్ అభిమానులు, SSMB28 గురించి మహేష్ అభిమానులు.. ఇలా ప్రతి హీరో అభిమానులు తమ హీరో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి కొద్ది రోజుల్లో ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే అభిమానులు అప్డేట్ ఇవ్వండి అని రచ్చ చేస్తున్నారు. ఇటీవల పుష్ప 2 అప్డేట్ కావాలని బన్నీ అభిమానులు ఏకంగా గీతా ఆఫీస్ ముందు ధర్నాకి కూడా దిగారంటే వీళ్ళ పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ విషయంలో ఎన్టీఆర్ సీరియస్ అయి అందరి హీరోల తరపున మాట్లాడాడని అంటున్నారు. మరి ఇప్పటికైనా అభిమానులు కూల్ అవుతారా, లేదా మళ్ళీ అలాగే అప్డేట్స్ అంటూ హంగామా చేస్తారా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు