NTR-Samantha : మరోసారి ‘జనతా గ్యారేజ్’ కాంబో రిపీట్.. ఎన్టీఆర్ సమంతతో ప్లాన్ చేస్తున్న కొరటాల శివ

ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. దీంతో ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. గతంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి 'జనతా గ్యారేజ్' సినిమా చేశారు. ఈ సినిమా మంచి......

NTR-Samantha : మరోసారి ‘జనతా గ్యారేజ్’ కాంబో రిపీట్.. ఎన్టీఆర్ సమంతతో ప్లాన్ చేస్తున్న కొరటాల శివ

NTR-Samantha :   ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 7న రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్నారు. కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా పనుల్లో ఉన్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి సమ్మర్ నుంచి కొత్త సినిమా మొదలు పెట్టనున్నారు.

ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా. దీంతో ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. గతంలోనే ఎన్టీఆర్ కొరటాల శివ కలిసి ‘జనతా గ్యారేజ్’ సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్స్ గా సమంత, నిత్యా మీనన్ నటించారు. అయితే ఈ కాంబోని మళ్ళీ రిపీట్ చేయనున్నారు.

Sreemukhi : అవినాష్, భానుశ్రీలతో కలిసి అర్ధరాత్రి న్యూ ఇయర్ రచ్చ రచ్చ చేసిన శ్రీముఖి

ఎన్టీఆర్ కొరటాల శివ నెక్స్ట్ సినిమాలో మళ్ళీ సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. మరి ఈ టైంలో ఎన్టీఆర్ సరసన సమంత ఒప్పుకొని డేట్స్ ఇస్తుందా అని ఆలోచిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ తో గతంలో మూడు సినిమాలు చేసింది సమంత. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. దాంతో సమంత ఈ సినిమా ఒప్పుకునే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ కాంబో ఓకే ఐతే మరోసారి జనతా గ్యారేజ్ ని మించి హిట్ సినిమా వస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.