NTR Speech : NTR30 అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్..

చివరగా అందరూ ఎన్టీఆర్ 30 అప్డేట్ అడగడంతో దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది. ఏది పడితే అది అప్డేట్..................

NTR Speech : NTR30 అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్..

NTR Speech : కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్న సినిమా అమిగోస్. యషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు రాజేంద్ర దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో సినిమాపై అంచనాలు పెంచేశారు. బింబిసార సినిమా తర్వాత మరో సరికొత్త కథతో కళ్యాణ్ రామ్ వస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

తాజాగా అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడటం మొదలుపెట్టగానే అభిమానులంతా అరుపులతో హోరెత్తించారు, అలాగే నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం అడిగారు. దీంతో అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు ఒంట్లో బాగోలేదు, అయినా వచ్చాను మీ కోసం, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, కానీ మాట్లాడాలి. ముందుగా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ రాజేంద్ర సినిమా చేశాకే ఇంటికి వస్తా అని ఇంట్లో వాళ్ళతో అన్నారు. కానీ సినిమా మొదలయ్యేలోపు వాళ్ళ అమ్మ, సినిమా అయ్యేలోపు నాన్న దూరమయినా ఇక్కడే సినిమాలో ఉన్నారు. సినిమా మీద పిచ్చితో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది, మీరు సాధించిన సక్సెస్ మీ పేరెంట్స్ పైనుంచి చూస్తారు.

ఇక నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నా శ్రేయాభిలాషులు. అసలు తెలుగు సినీ చరిత్రలో ఒకేసారి రెండు సినిమాలు, అది కూడా స్టార్ హీరోల సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండు రిలీజ్ చేసి రెండు సినిమాలు హిట్ అవ్వడం వాళ్లకి మాత్రమే అయింది. నిజంగా ఎక్కడో సుడి కలిగిన నిర్మాతలు, ఈ సినిమా కూడా హిట్ అయి వరుసగా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను.

ఇక కళ్యాణ్ అన్నయ్య యాక్టింగ్ లో నాకంటే సీనియర్. మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటులు ఉన్నా ప్రయోగాత్మక సినిమాలు చేసింది కళ్యాణ్ అన్న ఒక్కడే. జై లవకుశ చేశాను, చాలా కష్టం మూడు రోల్స్ చేయడం. ఇప్పుడు అన్నయ్య కష్టపడ్డారు, ఇది ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది అన్నయ్యకి. అందరూ RRR సినిమా గురించి, వచ్చిన సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీ ఆశీర్వచనాలతోనే ఆస్కార్ దాకా వెళ్ళాం. ఇది ముఖ్యంగా రాజమౌళి విజయం. RRR కి ఏ క్రెడిట్ వచ్చినా అది రాజమౌళికే దక్కాలి. అని అన్నారు.

Kalyan Ram : నా తమ్ముడు నా గుండెకాయ.. నాకు ఎవరూ లేకపోయినా నా తమ్ముడు ఉన్నాడు..

చివరగా అందరూ ఎన్టీఆర్ 30 అప్డేట్ అడగడంతో దాని గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది. ఏది పడితే అది అప్డేట్ ఇవ్వలేము. ఏమన్నా అప్డేట్ ఉంటే మా ఇంట్లో భార్యకంటే కూడా ముందు మీకే చెప్తాము. అదిరిపోయే అప్డేట్ ఉంటే మాత్రమే చెప్తాము. నా పరిస్థితి మాత్రమే కాదు అందరి హీరోల పరిస్థితి ఇదే. ఇలా అప్డేట్స్ ఎవర్ని అడగకండి. ఎక్కడెక్కడో ఉన్న వార్తలు చదివి మీరు అడగొద్దు. ఏమన్నా ఉంటే మేమె చెప్తాము. మీ అందరికోసం ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇస్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా ఓపెన్ చేస్తాం, మార్చ్ 20 తర్వాత షూట్ మొదలవుతుంది. 2024 ఏప్రిల్ 5కి రిలీజ్ చేస్తాం అని తెలిపారు. NTR 30 సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.