వావ్.. వెట్రిమారన్‌తో తారక్ – గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూనియర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్‌తో చేయనున్నారనే వార్త వైరల్ అవుతోంది..

  • Edited By: sekhar , February 7, 2020 / 12:55 PM IST
వావ్.. వెట్రిమారన్‌తో తారక్ – గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూనియర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్‌తో చేయనున్నారనే వార్త వైరల్ అవుతోంది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం #RRR లో నటిస్తున్నాడు. తారక్ కొమరంభీమ్‌గా కనిపించనున్న ఈ సినిమా 2021 జనవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత తారక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని, ‘అయినను పోయిరావలెను హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని, ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

దీని తర్వాత ప్రముఖ తమిళ్ రైటర్, డైరెక్టర్, నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వెట్రిమారన్‌‌తో ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడనే వార్త వైరల్ అవుతోంది. తాజాగా ‘అసురన్’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ అందించిన వెట్రిమారన్ సినిమాలన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ‘ఆడుకలం’, ‘NH 4’, ‘కాక్కా ముట్టై’, ‘విసారణై’ (తెలుగులో విచారణ), ‘కోడి’ (తెలుగులో ధర్మయోగి), ‘వడ చెన్నై’ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్యతో ‘వాడి వాసల్’ అనే సినిమా చేయనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మారన్, ఎన్టీఆర్‌ని కలిసి కథ చెప్పగా, తారక్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. పూర్తి కథతో రండి.. మనం సినిమా చేద్దాం.. అని మారన్‌కు మాటిచ్చాడట ఎన్టీఆర్.. 2021 జనవరిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.