NTR: రెడీ ఫర్ చేంజ్ అంటోన్న ఎన్టీఆర్! | NTR To Change Look For Koratala Siva Movie

NTR: రెడీ ఫర్ చేంజ్ అంటోన్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో...

NTR: రెడీ ఫర్ చేంజ్ అంటోన్న ఎన్టీఆర్!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో చెలరేగిపోయి నటించగా, ప్రేక్షకులు ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్టులో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. కానీ తారక్ మాత్రం ఇంకా తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయలేదు.

NTR : సినిమాకి ఇంకా టైం ఉంది.. అప్పుడే అంత క్లోజా.. ఫ్యామిలీలతో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్..

అయితే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తారక్ తన లుక్స్‌ను పూర్తిగా మార్చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్‌లో కాస్త బొద్దుగా కనిపించిన తారక్, కొరటాల శివ మూవీ కోసం మరోసారి స్లిమ్‌గా మారుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటిస్తాడని, అందుకే ఆ లుక్ కోసం స్లిమ్‌గా మారుతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది.

NTR: అదిరిపోయే న్యూస్.. ఎన్టీఆర్ కోసం ఆ బ్యూటీని పట్టుకొస్తున్న కొరటాల..?

గతంలో తారక్ స్టూడెంట్ లీడర్ పాత్రలో నటించిన సినిమా ‘సుబ్బు’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో మళ్లీ అలాంటి పాత్రలో తారక్ ఎలా కనిపిస్తాడా అని ఆయన అభిమానులు అప్పుడే టెన్షన్ పడుతున్నారు. అయితే ఈసారి కొరటాల మాత్రం పక్కా ప్లానింగ్‌తోనే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య దెబ్బతో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, తారక్ సినిమాలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేలా కొరటాల జాగ్రత్త పడుతున్నాడు. మరి నిజంగానే కొరటాల సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

×