NTR31: ఎన్టీఆర్ మళ్లీ అలా కనిపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్....

NTR31: ఎన్టీఆర్ మళ్లీ అలా కనిపిస్తాడా?

Ntr To Have Villain Shades In Ntr31

NTR31: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను తారక్ ఇప్పటికే వరుసగా అనౌన్స్ చేశాడు. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, 31వ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

NTR31: తారక్ కోసం టైటిల్స్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్..?

ఈ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావడంతో తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక్ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అసురుడు’ లేదా ‘అసుర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా.. ఈ సినిమాలో తారక్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!

ఈ చిత్రంలో తారక్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌ను కలిగి ఉంటుందని.. విలన్ తరహా పాత్రలో తారక్ మరోసారి నటవిశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో తారక్ ‘జై లవ కుశ’ చిత్రంలోనూ జై పాత్రలో నెగెటివ్ షేడ్స్‌తో కనిపించాడు. ఆ సినిమాలో ఆయన నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపిస్తాడనే వార్తతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమాలో తారక్ ఎలా నటిస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.