NTR : మళ్ళీ ఫ్యామిలీతో కలిసి ఫారెన్‌కి చెక్కేసిన ఎన్టీఆర్.. సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో..

ఎన్టీఆర్ కూడా కొరటాలతో, ప్రశాంత్ నీల్ తో సినిమాలు అనౌన్స్ చేశాడు కానీ ఏ సినిమా మొదలుపెట్టలేదు. RRR రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నాడు. అటు కొరటాల శివ కూడా ఖాళీగానే ఉన్నాడు. కానీ వీరి కాంబినేషన్ లో.............

NTR : మళ్ళీ ఫ్యామిలీతో కలిసి ఫారెన్‌కి చెక్కేసిన ఎన్టీఆర్.. సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో..

NTR Vacation with family to america

NTR :  ఎన్టీఆర్, రామ్ చరణ్ గత సంవత్సరం RRR సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించారు. RRR రిలీజ్ అయి సంవత్సరం అయిపోతుంది. నాలుగేళ్లుగా RRR సినిమా కోసమే టైం ఇవ్వడం, మధ్యలో కరోనా రావడంతో RRR సినిమా సక్సెస్ అయిన వెంటనే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఎవరి ఫ్యామిలీలతో వారు ఫారిన్ ట్రిప్ వేశారు.

చరణ్ ఫారిన్ ట్రిప్స్ నుంచి తిరిగొచ్చి శంకర్ సినిమా షూట్ కూడా మొదలుపెట్టాడు, మరో సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. ఎన్టీఆర్ కూడా కొరటాలతో, ప్రశాంత్ నీల్ తో సినిమాలు అనౌన్స్ చేశాడు కానీ ఏ సినిమా మొదలుపెట్టలేదు. RRR రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సంవత్సరం నుంచి ఖాళీగానే ఉన్నాడు. అటు కొరటాల శివ కూడా ఖాళీగానే ఉన్నాడు. కానీ వీరి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా మాత్రం ఇప్పటికి మొదలుపెట్టలేదు. కనీసం పూజా కార్యక్రమాలు కూడా అవ్వలేదు.

Siri hanumanthu : నాకు, శ్రీహాన్ కి నిజంగానే బ్రేకప్ అయింది.. కానీ..

ఎన్టీఆర్ ఎప్పుడు సినిమా మొదలుపెడతాడో అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం మళ్ళీ నెలరోజులు ఫారిన్ ట్రిప్ కి వెళ్ళాడు. తాజాగా ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికాకి వెళ్ళాడు. ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో కలిసి కనపడటంతో ఆ ఫోటో వైరల్ గా మారాయి. ఒకపక్క ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులంతా ఎదురు చూస్తుంటే ఎన్టీఆర్ ఏమో ఇలా ఫారిన్ ట్రిప్ కి నెల రోజులు వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.