NTR-MAHESH : బుల్లితెరపై ఎన్టీఆర్ తో మహేష్.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకి జనాల్లో మంచి రెస్పాండ్ వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా అంతకుముందే బిగ్ బాస్ లో అదరగొట్టారు.

NTR-MAHESH : బుల్లితెరపై ఎన్టీఆర్ తో మహేష్.

Ntr Mahesh

NTR-MAHESH :  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి జనాల్లో మంచి రెస్పాండ్ వస్తుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా అంతకుముందే బిగ్ బాస్ లో అదరగొట్టారు. ఇప్పుడు మళ్ళీ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో జనాల్ని అలరిస్తున్నారు. ఈ షోకి టిఆర్పి కొంచెం తక్కువే వచ్చినా ఎన్టీఆర్ హోస్టింగ్ కి మాత్రం ఫుల్ మార్క్స్ పడుతున్నాయి.

ఇక వీకెండ్స్ లో స్పెషల్ గెస్టులని తీసుకొస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివలు వచ్చారు. ఆ ఎపిసోడ్స్ ఆద్యంతం అలరించాయి. వీకెండ్ ఎపిసోడ్స్ కి మంచి స్పందన వస్తుంది. దీంతో ప్రతి వారం ఒక గెస్ట్ కచ్చితంగా తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు షో నిర్వాహకులు. తాజాగా ఈ షో షూట్ నుంచి ఒక పిక్ లీక్ అవడంతో ఆ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ కు మరో పెద్ద సెలబ్రిటీనే తీసుకొస్తున్నారు.

Kangana Ranut : ఆర్య‌న్‏కు హృతిక్ రోష‌న్ మ‌ద్ద‌తు..కంగ‌నా ఫైర్..

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో మొదటి వీకెండ్ లోనే రామ్ చరణ్ ని తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు దసరా స్పెషల్ ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుని తీసుకొస్తున్నారని సమాచారం. ఈ ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ షూటింగ్ టైంలో వీళ్లిద్దరు సెట్ మీద ఉన్న పిక్ ఒకటి లీక్ అవడంతో మహేష్ ఎన్టీఆర్ లు ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ షోలో కలిసి కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఎపిసోడ్ దసరాకి వస్తుందా లేక తర్వాత వస్తుందా అనే క్లారిటీ మాత్రం రాలేదు.

Pawan Kalyan : రిపబ్లిక్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా?? 

మహేష్ బాబు సామాన్యంగా ఇలాంటి బుల్లి తెర షోలకు ఎక్కువగా ఆసక్తి చూపించరు. కాని ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం కారణంగా ఎన్టీఆర్ అడగడంతో మహేష్ ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఇద్దరు స్టార్ హీరోలు బుల్లి తెరపై ఒకేసారి కనిపిస్తే టిఆర్పి రికార్డ్ బద్దలు అవ్వడం ఖాయం అంటూ అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.