NTR30: ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు కొరటాల శివతో కలిసి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.

NTR30: ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

NTR30 Movie To Go On Floors By This Time

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను దర్శకుడు కొరటాల శివతో కలిసి పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు. అయితే ఈ సినిమాను లాంచ్ చేసి రోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు.

NTR30: తారక్ కోసం రెడీ అవుతోన్న భారీ సెట్.. యాక్షన్‌తోనే బరిలోకి దిగుతాడా..?

దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించి ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్‌ను మార్చి నెల మధ్య నుంచి స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోందట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు, నటీనటుల ఎంపిక కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది.

NTR30: ట్రెండింగ్‌లో ఎన్టీఆర్30.. అప్డేట్ ఇయ్యండయ్యా అంటోన్న అభిమానులు!

ఇక తారక్ ఈ సినిమాలో మరోసారి కొత్త లుక్‌తో కనిపించనుండగా, ఆయన సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తుండగా, యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నాయి.