NTR30: తుఫాను హెచ్చరిక.. మార్చి 23న తారక్ విధ్వంసానికి ముహూర్తం పెట్టిన కొరటాల!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై తారక్ స్వయంగా ఓ ఈవెంట్‌లో ప్రస్తావించాడు కూడా.

NTR30: తుఫాను హెచ్చరిక.. మార్చి 23న తారక్ విధ్వంసానికి ముహూర్తం పెట్టిన కొరటాల!

NTR30: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఇచ్చేశాడు. దర్శకుడు కొరటాల శివతో కలిసి తారక్ తన కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కిస్తున్న మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఈ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ కావాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై తారక్ స్వయంగా ఓ ఈవెంట్‌లో ప్రస్తావించాడు కూడా.

NTR30: ఎన్టీఆర్ సినిమా ఓపెనింగ్‌కు ఆ స్టార్ యాక్టర్ వస్తున్నాడా..?

అయితే, ఇప్పుడు అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఎప్పుడనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ 30వ చిత్రానికి మార్చి 23న ముహూర్తం ఫిక్స్ చేసింది కొరటాల అండ్ టీమ్. ఈ మేరకు ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. సముద్రం నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుండగా, ఈ సినిమాలో తారక్ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాను క్వాలిటీ పరంగా ఆర్ఆర్ఆర్‌ను మించి ఉండేలా ప్రయత్నిస్తామని తారక్ ఇటీవల హాలీవుడ్ మీడియాతో వెల్లడించాడు.

NTR30: తన నెక్ట్స్ మూవీపై ఎన్టీఆర్ కామెంట్స్.. ‘ఆర్ఆర్ఆర్’ను మ్యాచ్ చేస్తామంటోన్న తారక్!

దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ కాగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాతో తారక్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నాయి. కాగా, ఈ సినిమా ముహూర్తానికి బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ రానున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.