NTR30: చీకట్లో విలన్లను చెడుగుడు ఆడేస్తున్న తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం NTR30 అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. శంషాబాద్ ప్రాంతంలో ఈ సినిమా ప్రస్తుతం నైట్ షూట్ జరుపుకుంటోంది.

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాన్ని NTR30 అనే వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల డైరెక్ట్ చేస్తోండగా, ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది.

NTR30: ఏడాది తరువాత సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చిన టైగర్.. విధ్వంసానికి యాక్షన్ షురూ!

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లో తారక్ కూడా జాయిన్ అయ్యాడు. ఇక కొరటాల ఈ సినిమా షూటింగ్‌ను ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఈ సినిమా ప్రస్తుతం నైట్ షూట్ జరుపుకుంటోంది. విలన్లను చెడుగుడు ఆడేస్తున్న తారక్ నైట్ షూట్‌లో బిజీగా ఉన్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సముద్రం నేపథ్యంలో సాగే కథ కావడంతో మెజారిటీ షూటింగ్‌ను సెట్స్‌లోనే చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకొచ్చాడు కొరటాల.

NTR30 : శ్రీరామనవమి కానుకగా NTR30 అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్..

తారక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా ఆయన కెరీర్ బెస్ట్ మూవీగా నిలవనుందని కొరటాల అండ్ టీమ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో అమ్మడు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నాడు. మరి ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు