#NTR30 : తారకరత్న మృతితో.. వాయిదా పడ్డ NTR 30 పూజా కార్యక్రమం..

ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. కానీ అనుకోకుండా నందమూరి తారకరత్న మరణించడంతో ఈ పూజా కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం తారకరత్న మృతితో నందమూరి కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.............

#NTR30 : తారకరత్న మృతితో.. వాయిదా పడ్డ NTR 30 పూజా కార్యక్రమం..

#NTR30 :  NTR 30 సినిమా కోసం గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రకటించినా అవి ఇంకా మొదలవ్వలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. NTR 30 సినిమా దర్శకుడు కొరటాల శివతో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అడుగుతున్నారు.

దీంతో ఇటీవల అమిగోస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. సినిమాలు చేసేటప్పుడు ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం. మీరు అడుగుతారు కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది. ఏది పడితే అది అప్డేట్ ఇవ్వలేము. ఏమన్నా అప్డేట్ ఉంటే మా ఇంట్లో భార్యకంటే కూడా ముందు మీకే చెప్తాము. అదిరిపోయే అప్డేట్ ఉంటే మాత్రమే చెప్తాము. నా పరిస్థితి మాత్రమే కాదు అందరి హీరోల పరిస్థితి ఇదే. ఇలా అప్డేట్స్ ఎవర్ని అడగకండి. నా నెక్స్ట్ సినిమా ఫిబ్రవరిలో ఓపెన్ చేస్తాం, మార్చ్ 20 తర్వాత షూట్ మొదలవుతుంది. 2024 ఏప్రిల్ 5కి రిలీజ్ చేస్తాం అని తెలిపారు. దీంతో హమ్మయ్య NTR 30 సినిమా అప్డేట్ వచ్చిందని అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు.

Balakrishna-Vijayasai Reddy : తారకరత్న కోసం.. అన్నీ తామే అయి దగ్గరుండి చూసుకుంటున్న బాలకృష్ణ, విజయసాయి రెడ్డి..

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24న పూజా కార్యక్రమాలు జరపాలని నిర్ణయించుకున్నారు చిత్రయూనిట్. కానీ అనుకోకుండా నందమూరి తారకరత్న మరణించడంతో ఈ పూజా కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం తారకరత్న మృతితో నందమూరి కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సమయంలో కొత్త సినిమా ప్రారంభించడం సరికాదని ఫిబ్రవరి 24న జరగాల్సిన #NTR30 సినిమా పూజా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. త్వరలో కొత్త డేట్ ని ప్రకటిస్తారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ అభిమానులు NTR30 విషయంలో నిరాశ చెందుతున్నారు.