NTR30: పండగపూట ఎన్టీఆర్ హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నారా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తారక్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో తారక్ మరోసారి మేకోవర్ అవుతుండటంతో ఈ మూవీలో ఆయన ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

NTR30: పండగపూట ఎన్టీఆర్ హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నారా..?

NTR30 To Announce Heroine Officially With A New Poster

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన తారక్, త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాలో తారక్ మరోసారి మేకోవర్ అవుతుండటంతో ఈ మూవీలో ఆయన ఎలాంటి లుక్‌తో కనిపిస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

NTR30: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్.. కొరటాల ప్లాన్ వర్కవుట్ అయ్యేనా?

ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ విషయంలోనూ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను తీసుకుంటారనే వార్త వినిపించినా, ఆమెకు పెళ్లయిపోవడంతో ఇప్పుడు ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను పట్టుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను తెలగు తెరకు పరిచయం చేసేందుకు కొరటాల ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో ఆమెను హీరోయిన్‌గా కన్ఫం చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.

NTR30: తారక్ కోసం బరిలోకి దిగుతున్న బాలీవుడ్ విలన్..?

అంతేగాక, ఎన్టీఆర్ 30వ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ అనౌన్స్‌మెంట్‌ను కూడా త్వరలోనే ఓ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ చేయనుందట. సంక్రాంతి కానుకగా ఈ అనౌన్స్‌మెంట్ ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి నిజంగానే ఎన్టీఆర్ 30వ చిత్రం నుండి పండగ ట్రీట్‌గా హీరోయిన్ అనౌన్స్‌మెంట్ రాబోతుందా.. నిజంగానే తారక్ సరసన నటించే లక్కీ ఛాన్స్ జాన్వీ కపూర్ కొట్టేసిందా.. అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.