NTR30: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ కాదట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేస్తామని తారక్ ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపాడు.

NTR30: తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ.. జాన్వీ కపూర్ కాదట!

NTR30 To Have Mrunal Thakur As Female Lead

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే స్టార్ట్ చేస్తామని తారక్ ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపాడు.

NTR Speech : NTR30 అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్..

దీంతో ఈ సినిమాలో తారక్‌తో పాటు ఇంకెవరెవరు నటిస్తున్నారా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించినా, ఎవరినీ చిత్ర యూనిట్ కన్ఫం చేయలేదు. కాగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో నటించబోతుందనే వార్త మాత్రం జోరుగా వినిపించింది. అయితే, ఆమె తండ్రి బోనీ కపూర్ జాన్వీ ప్రస్తుతం ఎలాంటి సౌత్ సినిమాలో నటించడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు తారక్ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.

NTR30: ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?

సీతారామం మూవీతో టాలీవుడ్‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం నాని 30వ చిత్రంలో నటిస్తోంది. అయితే అమ్మడి పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన దర్శకుడు కొరటాల, తారక్‌తో సినిమాలో ఆమెను తీసుకోవాలని చూస్తున్నాడట. ఈమేరకు అమ్మడిని సంప్రదించేందుకు కూడా కొరటాల రెడీ అవుతున్నాడట. మరి నిజంగానే మృణాల్‌కు ఈ క్రేజీ ఆఫర్ దక్కుతుందా లేదా అనేది చూడాలి.