కొమరం భీం జయంతి రోజే: ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

  • Published By: vamsi ,Published On : September 3, 2019 / 10:46 AM IST
కొమరం భీం జయంతి రోజే: ఆర్ఆర్ఆర్.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

తెలుగు సినిమా ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ బల్గెరియాలో జరుగుతుంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రయూనిట్ షూట్ చేస్తుంది.  ఇంకో నెలరోజులపాటు అక్కడే షూటింగ్ జరగనుండగా.. అక్టోబర్ లో కొమరం భీం జయంతి( అక్టోబర్ 22) సంధర్భంగా ఫస్ట్ లుక్ ను సింగిల్ డైలాగ్ తో చిత్రయూనిట్ విడుదల చేయాలని భావిస్తుంది.

ఈ క్రమంలో నాలుగు తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సింగిల్ డైలాగ్ వీడియోని విడుదల చేయనున్నారు. మాములుగా అయితే తెలుగులో ఎన్టీఆర్ డబ్బింగ్ చెబితే.. మిగిలిన భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పిస్తుంటారు.

అయితే ఈ సినిమాలో మాత్రం.. ఎన్టీఆర్ తోనే అన్నీ భాషల్లో డబ్బింగ్ చెప్పించాలని యోచిస్తుంది చిత్రయూనిట్. అయితే ఎన్టీఆర్ కు కన్నడ మాత్రం బాగా వచ్చు అనే విషయం తెలిసిందే. ఇంతకుముందు కన్నడలో పాట కూడా పాడారు ఎన్టీఆర్. మిగిలిన భాషలను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి.