Nayanatara : పెళ్లి కాకముందే ప్రియుడితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్న నయనతార

విగ్నేష్, నయనతార ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఎవరు అడిగినా సమాధానం చెప్పట్లేదు కానీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఈ మధ్య ఇద్దరూ

Nayanatara : పెళ్లి కాకముందే ప్రియుడితో కలిసి తీర్థయాత్రలు చేస్తున్న నయనతార

Nayan

Nayanatara :  లేడీ సూపర్ స్టార్‌ నయనతార, డైరెక్టర్ విగ్నేష్‌ శివన్‌ ప్రేమలో ఉన్నారన్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళిద్దరూ ప్రేమ పావురాలు లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారు. అంతే కాక వీళ్ళిద్దరూ కలిసి సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌ ని ప్రారంభించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. విగ్నేష్, నయనతార ఇద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ఎవరు అడిగినా సమాధానం చెప్పట్లేదు కానీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఈ మధ్య ఇద్దరూ కలిసి వరుసగా దేవాలయాలని సందర్శిస్తున్నారు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం నయన్ విగ్నేష్ లు కలిసి తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. తాజాగా షిరిడి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. అంతేకాక ముంబైలోని మహాలక్ష్మి ఆలయం, సిద్ధి వినాయక్‌ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇలా వరుసగా దేవాలయాలు దర్శిస్తున్నారు ఏంటి పెళ్లి కాకుండానే అని అందరూ అనుకుంటున్నారు.

Bigg Boss 5 : షన్నుని మోసం చేసిన సిరి.. నన్ను వెధవని చేసారంటూ ఏడ్చేసిన షన్ను..

ప్రస్తుతం నయనతార సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సరసన ‘అన్నాత్తే’లో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్‌ 4న గ్రాండ్‌ రిలీజ్‌ అవ్వబోతుంది. అంతే కాక విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా, అట్లీ, షారుఖ్‌ కాంబోలో రాబోతున్న పాన్‌ ఇండియా మూవీలో హీరోయిన్‌గానూ నయనతార చేస్తుంది. మరి వీళ్లిద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అని కోలీవుడ్ తో పాటు అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.