OG Movie: పవన్ కోసం ఆ టైటిల్‌నే ఫిక్స్ చేసిన సుజిత్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సుజిత్‌తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు పవన్. OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

OG Title Registered For Pawan Kalyan Sujeeth Movie
OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు, సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవన్-సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ మూవీలతో పాటు దర్శకుడు సుజిత్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలే కాకుండా, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Pawan Kalyan OG : అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ సుజిత్.. OG Is Coming!
కాగా, ఈ సినిమాల్లో సుజిత్‌తో సినిమాను అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు పవన్. ‘సాహో’ మూవీ తరువాత సుజిత్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న తరుణంలో, పవన్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ఈ సినిమాకు OG అనే టైటిల్‌ను కూడా అనౌన్స్ చేశాడు సుజిత్. అయితే, ఇప్పుడు ఇదే టైటిల్‌ను సినిమాకు ఫిక్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
Pawan Kalyan: ఏప్రిల్ మొత్తం బిజీబిజీ అంటోన్న పవన్..!
OG అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిజిస్టర్ చేయించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు OG అనే పేరుతో చాలా హైప్ రావడం.. ఈ టైటిల్ సినిమా కథకు బాగా యాప్ట్ అవుతుందని సుజిత్ అండ్ టీమ్ భావించింది. అందుకే, జనంలోకి ఆల్రెడీ వెళ్లిపోయిన టైటిల్ కాబట్టి, దీన్నే ఇప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. డివివి.దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.