రాధికా హైస్కూల్ లవ్ : కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదట

రాధికా హైస్కూల్ లవ్ : కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదట

తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు.

రాధికా హైస్కూల్ లవ్ : కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదట

తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు.

తాను కూడా అందరిలాంటి అమ్మాయినేనని,తాను చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేశానని రాధికా ఆప్టే అన్నారు. ఏ మాత్రం భయం లేకుండా, వెనుకా ముందు ఆలోచించకుండా తన మనసులో ఉన్నది బయటపెడుతూ బోల్డ్ బ్యూటీగా సినీపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నఈ అమ్మడు తనకు హైస్కూల్ రోజుల్లో ఓ లవ్ స్టోరీ ఉందని తెలిపింది.పలు భాషాల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే… స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించినట్లు ఆమె తెలిపింది. అతడి కోసమే డైలీ స్కూల్ కి వెళ్లేదానినని, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లినా కూడా అతడే గుర్తుకొస్తుండేవాడని,అతడు కలలోకి వస్తాడని తర్వగా నిద్రపోయేదాన్నని తెలిపింది. 
Read Also : కోహ్లీకి సర్‌ప్రైజ్ : ట్రైనింగ్ క్యాంప్‌కు వచ్చిందెవరో తెలుసా

ఓ మై హృతిక్‌ అనే కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రాధిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని మీడియా ద్వారా పంచుకున్నారు.మహిళలు తాము కనే కలల గురించి ఎలాంటి సంకోచం లేకుండా బయటికి చెప్పుకోవాలని, అప్పుడు వారు మానసికంగా, శారీరకంగా ఎలా ఉన్నారు? అన్న విషయాలు తెలుస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాన్నిగుర్తుచేసుకుంటూ….నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఓ పని మనిషి ఉండేది. తను ఎక్కువగా సినిమాలు చూసేది. నేను కూడా తనతో పాటే సినిమాలు చూసేదాన్ని. కొన్ని పాటల్లో వర్షం పడుతున్నప్పుడు హీరోయిన్‌ చీరకొంగు గాలికి ఎగరడం, ఆ తర్వాత హీరో వచ్చి ఆమెతో పాటలు పాడుతూ చిందులేయడం ఎక్కువగా ఉండేవి. నేను కూడా నన్నో హీరోయిన్‌లా ఊహించుకునేదాన్ని. మా క్లాస్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను.

నేను కూడా చీరకట్టుకుని వర్షంలో తడుస్తున్నప్పుడు అతను నాతో డ్యూయెట్లు పాడితే బాగుండు అని ఊహించుకునేదాన్ని. అది ఎప్పుడూ జరగలేదు. అందుకే కనీసం కలలో అయినా నేను అనుకున్నది జరగాలని అతని కోసమే త్వరగా నిద్రపోయేదాన్ని’ అని తెలిపారు. రక్తచరిత్ర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.ఇటీవల ఈ అమ్మడు వెబ్ సిరీస్ లలో కూడా నటించి తనదైన శైలిలో దూసుకెళ్తుంది.

ముంబయిలోని మీథీబాయి కాలేజ్‌కు చెందిన కొందరు విద్యార్థినులు ఈ ‘ఓ మై హృతిక్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. హృతిక్‌ రోషన్‌ అందరి కలల రాకుమారుడు కాబట్టి అతని పేరును వాడుకున్నామని వారు అంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆడవాళ్లు తమ అనుభవాల గురించి ధైర్యంగా చర్చించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Read Also : సుమలత, నిఖిల్ కు ఈసీ షాక్.. సినిమా ప్రసారాలపై నిషేధం

×