Sita Ramam: ఓహ్ సీత.. హే రామ.. బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అవుట్!

Oh Sita .. Hey Rama .. Beautiful Melody Song Out from Sita Ramam

Sita Ramam: ఓహ్ సీత.. హే రామ.. బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ అవుట్!

Sitha Ramam

Sita Ramam: మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌ర్నీ మెప్పిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ఓ త్రిభాషా సినిమా చేస్తున్నాడు. హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌లో హీరోగా కనిపించనున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

SitaRamam: యుద్ధంతో రాసిన ప్రేమ కథ ‘సీతా రామం’.. గ్లిమ్ప్స్ రిలీజ్!

ఆ మధ్య దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయగా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఇక, శ్రీరామనవమి రోజున ‘సీతా రామం’ అనే క్యాచీ టైటిల్‌ ను ప్రకటిస్తూ అదిరిపోయే ఓ గ్లింప్స్ వీడియోను కూడా విడదుల చేశారు. పోస్టర్లు, గ్లిమ్ప్స్ తో అట్రాక్ చేసిన ఈ ప్రాజెక్ట్ నుండి ఇప్పుడు ఫస్ట్ సింగిల్ గా ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.

Dulquer Salmaan : ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న దుల్కర్ సల్మాన్

‘ఓ సీతా- హే రామా’ పాట సంగీత ప్రేమికుల మనసులో నిలిచిపోయేలా కనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా అనిపిస్తుంది. పాటలో వినిపించిన ఈ సాహిత్యం ‘సీతా రామం’ ప్రేమకథలో మాధుర్యాన్ని అందంగా చెప్పాయి. ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాటని అద్భుతంగా ఆలపించగా.. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ మ్యూజికల్ మోమోరీస్ ని గుర్తుకు తెచ్చింది. ఆడియన్స్ లూప్ మోడ్ లో పెట్టుకొని మళ్ళీమళ్ళీ వినే చార్ట్ బస్టర్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంది.

Rashmika Mandanna: బ్రేకప్‌తో బిగ్గెస్ట్ సక్సెస్‌లు అందుకుంటున్న కన్నడ కస్తూరి!

ఇక ఈ పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. దుల్కర్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బ్యుటిఫుల్ గా వుంది. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్ తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక దృష్టిపెట్టి అద్భుతమైన ఆల్బమ్ ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో వున్నారని ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తే అర్ధమౌతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.