Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’కు బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారో తెలుసా..?
శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రంగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యింది.

Oke Oka Jeevitham Gets Average TRP On First Time TV World Premiere
Oke Oka Jeevitham: యంగ్ హీరో శర్వానంద్ తన కెరీర్‌లో 30వ చిత్రంగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకార్తిక్ డైరెక్ట్ చేయగా, పూర్తి ఫీల్‌గుడ్ కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించారు. తల్లి సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక శర్వానంద్ యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది.
Oke Oka Jeevitham: ఓటీటీలో ఎంట్రీ ఇస్తోన్న ఒకే ఒక జీవితం
ఇక ఈ సినిమాలో అమలా అక్కినేని చాలా రోజుల తరువాత స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చారు. ఆమె పాత్ర ఈ సినిమాకు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు థియేటర్లలో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కమర్షియల్ పరంగా ఈ సినిమా హిట్ కావడంతో శర్వా అండ్ టీమ్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా ఈ సినిమాను బుల్లితెరపై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేశారు. ప్రముఖ ఛానల్ జెమిని టీవీలో ఈ సినిమాను టెలికాస్ట్ చేయగా, దీనికి 2.08 టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లుగా తెలుస్తోంది.
Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’పై నేచురల్ స్టార్ నాని కామెంట్స్.. ఏమన్నాడంటే..?
ఒక చిన్న బడ్జెట్ సినిమాకు ఈ స్థాయి టీఆర్పీ రేటింగ్ రావడం విశేషమని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా, అందాల భామ రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.