Bigg Boss OTT Telugu: పాత వాళ్ళు వారియర్స్.. కొత్త వాళ్ళు చాలెంజర్స్!

నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్. ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ..

Bigg Boss OTT Telugu: పాత వాళ్ళు వారియర్స్.. కొత్త వాళ్ళు చాలెంజర్స్!

Bigg Boss OTT Telugu: నో కామా.. నో ఫుల్‌స్టాప్.. బిగ్‌బాస్ అయింది ఇక నాన్‌స్టాప్. ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం సాయంత్రం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రసారం మొదలైంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లను సాదరంగా ఆహ్వానించి వాళ్ళ వివరాలను ఆరాతీసిన నాగార్జున అదే సాదరంగా బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళని పంపించాడు.

Bigg Boss OTT Telugu: నాన్‌స్టాప్ బిగ్‌బాస్ 17 మంది కంటెస్టెంట్లు వీళ్ళే!

బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో తొలి కంటెస్టెంట్ గా అషూ రెడ్డి (బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ కంటెస్టెంట్) అడుగు పెట్టగా.. మహేశ్ విట్టా (బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ కంటెస్టెంట్), ముమైత్‌ఖాన్ (బిగ్‌బాస్ తొలి సీజన్ కంటెస్టెంట్), అజయ్‌ కాతువాయూర్‌ (కొత్త కంటెస్టెంట్), స్రవంతి చొక్కారపు (కొత్త కంటెస్టెంట్), ఆర్జే చైతూ (కొత్త కంటెస్టెంట్), అరియానా గ్లోరీ (బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ కంటెస్టెంట్), నటరాజ్‌ మాస్టర్‌ (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్), శ్రీరాపాక (కొత్త కంటెస్టెంట్), మోడల్ అనిల్ (కొత్త కంటెస్టెంట్), మిత్ర శర్మ (కొత్త కంటెస్టెంట్), తేజస్వి మదివాడ (బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ కంటెస్టెంట్), సరయు రాయ్‌ (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్), యాంకర్‌ శివ (కొత్త కంటెస్టెంట్), బిందుమాధవి (కొత్త కంటెస్టెంట్), హమీదా (బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ కంటెస్టెంట్), అఖిల్ సార్థ‌క్‌ (బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ రన్నరప్‌) హౌస్ లో అడుగు పెట్టారు.

Bigg Boss OTT Telugu: రెడ్‌లైట్ ఏరియాకన్నా డేంజర్.. బిగ్‌బాస్‌పై నారాయణ ఫైర్!

ఇంట్లోకి వెళ్లిన 17 మంది కంటెస్టెంట్లను రెండు భాగాలు చేసిన నాగ్.. గత సీజన్లలో పాల్గొన్న వారిని వారియర్స్‌గా, కొత్తగా వచ్చిన వారిని చాలెంజర్లుగా పేర్కొంటున్నట్టు ప్రకటిస్తూ మొత్తం 84 రోజులు పాటు ఈ హౌస్ లో ఉండే ఛాన్స్ ఉందని ప్రకటించాడు. ఇందులో పాత వాళ్ళ గురించి తెలిసిందే కాగా కొత్తగా.. అజయ్‌ కాతువాయూర్‌, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, శ్రీరాపాక, మోడల్ అనిల్, మిత్ర శర్మ, యాంకర్‌ శివ, బిందుమాధవి చాలెంజర్లుగా హౌస్ లో అడుగు పెట్టారు.