Rajamouli : RRR సినిమాలో హీరోలేనా.. వాళ్ళని కూడా పట్టించుకోండి.. అభిమానుల ఆవేదన..

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ను మాత్రమే పొగుడుతూ వారిద్దరికే ఎక్కువగా హైపు ఇస్తున్నాడు. సినిమాలో వాళ్ళే హీరోలైనప్పటికీ ఇంత భారీ సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్నారు. అప్పుడప్పుడు.................

Rajamouli : RRR సినిమాలో హీరోలేనా.. వాళ్ళని కూడా పట్టించుకోండి.. అభిమానుల ఆవేదన..

Olivia moris and ajay devagn shriya fans disappointed for rajamouli not talking about their stars in RRR promotions at america

Rajamouli :  ‘ఆర్.ఆర్.ఆర్’ పేరు నేషనల్, ఇంటర్నేషనల్ రేంజ్ లో మారుమోగిపోతోంది. ఎన్నో అవార్డుల్ని కూడా అందుకుంటోంది. ఇందులోని పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది కూడా. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ కేవలం తారక్ అండ్ చెర్రీలకు మాత్రమే ఇస్తూ ఆ ఇద్దరినే ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తుండడంతో అందులో నటించిన పలువురు నటీనటుల్ని పట్టించుకోండం లేదని వాళ్ళ అభిమానుల నుంచి విమర్శలొస్తున్నాయి.

RRR చిత్రయూనిట్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఆస్కార్ వేడుక జరగనుంది. చిత్ర యూనిట్ మరోసారి అమెరికాలో RRR సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అన్ని విషయాల్లో RRR సినిమాని, రాజమౌళిని, చిత్ర బృందాన్ని అభినందించిన మన దేశంలోని కొంతమంది మాత్రం ఓ విషయంలో రాజమౌళిని, చిత్రయూనిట్ ని విమర్శిస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ ను మాత్రమే పొగుడుతూ వారిద్దరికే ఎక్కువగా హైపు ఇస్తున్నాడు. సినిమాలో వాళ్ళే హీరోలైనప్పటికీ ఇంత భారీ సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. సినిమాలో కీలక పాత్రలు చేసిన ఆలియాభట్, ఓలివియా మోరిస్, అజయ్ దేవ్ గణ్, శ్రియ లాంటి వాళ్ళని పక్కన పెట్టి హీరోలిద్దరినే డైరెక్టర్ లిఫ్ట్ చేస్తున్నాడని రాజమౌళిపై కామెంట్స్ పడుతున్నాయి. RRR సినిమాలో ఒలీవియా పాత్ర కూడా పెద్దదే. అలియాభట్ కంటే కూడా ఒలీవియానే ఎక్కువ సేపు కనిపిస్తుంది సినిమాలో. ‘నాటు నాటు’ పాటలో డ్యాన్స్ చేసినప్పుడు స్ర్కీన్ పై ఒలివియా మోరిస్ డ్యాన్స్ కూడా చేస్తుంది. కానీ ఈ పాట ఇప్పుడు ఆస్కార్ దాకా వెళ్లినా ఆమెను అసలు ప్రస్తావించలేదు రాజమౌళి, చిత్రయూనిట్.

Allu Arjun : ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. లైవ్ కాన్సర్ట్ లో నెదర్లాండ్ సింగర్‌తో కలిసి స్టెప్పులేసిన బన్నీ..

నాటు నాటు పాట తర్వాత ఒలీవియా మారిస్ కి ఇండియాలో కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు హాలీవుడ్ లో RRR చేసే ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా ఒలీవియా పేరు ప్రస్తావించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. అలాగే అజయ్ దేవగన్, శ్రియ కూడా మంచి పాత్రల్లో కనిపించారు. కానీ వాళ్ళ గురించి కూడా ఒక్కసారైనా ప్రస్తావించకపోవడంతో ఆ స్టార్స్ అభిమానులు కూడా రాజమౌళిని ఈ విషయంలో విమర్శిస్తున్నారు. సినిమాకి హీరోలు ముఖ్యమైనా, సినిమాలని నడిపించేది హీరోలైనా, అందరూ కలిస్తేనే సినిమా. అందులోను RRR లాంటి సినిమాల్లో అందరి పాత్రలు ముఖమైనవే కాబట్టి కనీసం కొన్ని సందర్భాలలోనైనా అందర్నీ ప్రస్తావించాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆస్కార్ వేదికపై చిత్రయూనిట్ ఎవరన్నా అందరి గురించి మాట్లాడతారేమో చూడాలి.