Om Raut : ఆదిపురుష్‌పై వచ్చే ట్రోల్స్ చూసి నేనేం సర్‌ప్రైజ్ అవ్వలేదు.. ఇది థియేటర్లో మాత్రమే చూసే సినిమా..

తాజాగా ఓం రౌత్ తనపై, టీజర్ పై వస్తున్న ట్రోల్స్ కి స్పందించాడు. ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ.. ''ఆదిపురుష్ సినిమాపై, నాపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనేం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే......................

Om Raut : ఆదిపురుష్‌పై వచ్చే ట్రోల్స్ చూసి నేనేం సర్‌ప్రైజ్ అవ్వలేదు.. ఇది థియేటర్లో మాత్రమే చూసే సినిమా..

Om Raut :  ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ ఇటీవల రిలీజయింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో ఉంది ఈ సినిమా. అయితే టీజర్ చూసిన తర్వాత రామాయణాన్ని కొంచెం కొత్తగా చూపించడానికి ఓం రౌత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.

కానీ టీజర్ మొత్తం VFX లతోనే ఉండటంతో ఇది కార్టూన్ సినిమాలాగా అనిపిస్తుంది. దీంతో టీజర్ కంటెంట్ పరంగా బాగున్నా గ్రాఫిక్స్ సినిమా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇది ఒక యానిమి సినిమాలాగా ఉందని, బొమ్మల సినిమా, కార్టూన్స్ లా ఉందని, రామాయణం కథ అని చెప్పి షూటింగ్ త్వరగా పూర్తి చేసినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది అని కామెంట్స్ చేస్తూ అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ ఓం రౌత్ ని తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

అసలు అది రామాయణంలా అనిపించడానికి ఒక్క అంశం కూడా లేదని, ఏదో హాలీవుడ్ గ్రాఫిక్స్ సినిమా చూసినట్టు ఉందని, రామాయణం అని చెప్పి రావణాసురుడికి మొఘల్ రాజులు, ముస్లిం రాజుల గెటప్స్ వేశారని, అసలు రామాయణం గురించి తెలుసా అని హిందూ సంఘాలు, బీజేపీ ప్రతినిధులువుమ్ రౌత్ పై మండిపడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఆదిపురుష్ ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ ని మెచ్చుకునే వాళ్ళకంటే విమర్శించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు.

GodFather : కింగ్ నైనా, కింగ్ మేకర్ నైనా తయారు చేసేది ఈ బ్రహ్మ.. మరో వాయిస్ ట్వీట్‌తో గాడ్‌ఫాదర్ పై అంచనాలు పెంచేసిన మెగాస్టార్

అయితే తాజాగా ఓం రౌత్ తనపై, టీజర్ పై వస్తున్న ట్రోల్స్ కి స్పందించాడు. ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓం రౌత్ మాట్లాడుతూ.. ”ఆదిపురుష్ సినిమాపై, నాపై వచ్చిన ట్రోల్స్ చూసి నేనేం ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఈ సినిమాని థియేటర్లో చూడాల్సింది. దీనిని మొబైల్ లో చూస్తే కచ్చితంగా నచ్చదు. కాకపోతే టీజర్ అనేది సినిమా ప్రమోషన్ కోసం కాబట్టి, సినిమా థియేటర్ కి జనాలని రప్పించాలి కాబట్టి ఆ సినిమాకి సంబంధించిన ఓ టీజర్ ని యూట్యూబ్ లో పెట్టాలి. ఎక్కువమందికి ఈ సినిమా గురించి రీచ్ అవ్వడానికి, రామాయణం అందరికి తెలియడానికి, థియేటర్ కి వచ్చి ఈ సినిమా చూడటానికి మాత్రమే ఆ టీజర్ ని ప్రమోషన్ లా వాడాము. ఇది ఫోన్ లో చూసే సినిమా కాదు, థియేటర్లో మాత్రమే చూసే సినిమా అందుకే నేను రిలీజ్ చేసిన టీజర్ చాలా మందికి నచ్చలేదు. సినిమా థియేటర్లో చూసిన తర్వాత అందరికి నచ్చుతుంది” అని తెలిపారు.

దీంతో మరోసారి ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు ఓం రౌత్ ని ట్రోల్ చేస్తున్నారు. రామాయణం అని చెప్పి గ్రాఫిక్స్ సినిమా తీస్తున్నందుకు, రామాయణంలో ఉన్నట్టు కాకుండా పాత్రల్ని ఇష్టమొచ్చినట్టు డిజైన్ చేసినందుకు ట్రోల్ చేస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా ఫోన్ లో చూసే సినిమా కాదు, థియేటర్లో చూసే సినిమా అంటారేంటి అంటూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా జనాల్ని థియేటర్ దాకా రప్పించడానికి ఒక ట్రిక్ అని అంటున్నారు. చూడాలి మరి సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎంతమందిని మెప్పిస్తుందో.