Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

గ్లామర్ షోపై ఫుల్ ఫోకస్ చేశారు టాలీవుడ్ హీరోయిన్స్. నిన్నమొన్నటి వరకు కాస్త పద్ధతిగా కనిపించిన వాళ్లు.. ఇప్పుడు తగ్గేదే లే అన్న రేంజ్ లో స్కిన్ షో చేసేస్తున్నారు. సినిమాలతో పాటూ..

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

Telugu Heroins

Telugu Heroins: గ్లామర్ షోపై ఫుల్ ఫోకస్ చేశారు టాలీవుడ్ హీరోయిన్స్. నిన్నమొన్నటి వరకు కాస్త పద్ధతిగా కనిపించిన వాళ్లు.. ఇప్పుడు తగ్గేదే లే అన్న రేంజ్ లో స్కిన్ షో చేసేస్తున్నారు. సినిమాలతో పాటూ అవసరమైతే ప్రమోషన్స్ లో కూడా గ్లామర్ డోస్ పెంచి అట్రాక్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

Aishwarya Dhanush: ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణమిదేనా? మళ్ళీ కలుస్తారా?

ఊ అంటావా అంటూ కుర్రకారు మతిపొగొట్టింది సమంతా. కెరీర్ స్టార్టింగ్ లో సామ్ గ్లామర్ షో చేసింది. పెళ్లయ్యాక ఆ డోస్ కాస్త తగ్గించింది. మళ్లీ విడాకులయ్యాక స్కిన్ షో ఇంకాస్త పెంచి పుష్ప పాటలో రెచ్చిపోయింది. పైగా బాలీవుడ్ ఛాన్సెస్ కోసం చూస్తుంది కాబట్టి సామ్ వైపు మేకర్స్ ఫోకస్ చేసేలా టార్గెట్ చేస్తుంది. ఇంటా బయట, జిమ్ లో కాస్త పొదుపైన బట్టలు వేసుకుని హాట్ హీరోయిన్ అనిపించుకుంటుంది సమంతా.

Ravanasura: మాస్ రాజాతో ఆట పాట.. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్స్!

ఇంతవరకు పద్ధతిగానే కనిపించింది అనుపమా పరమేశ్వరన్. హీరోయిన్ రేసులో వెనుకబడుతున్నా అనుకుందో ఏమో.. ఏకంగా అప్ కమింగ్ హీరోకో లిప్ లాక్ చేసేసి హెడ్ లైన్స్ లో నిలిచింది. రౌడీబాయ్స్ సీన్స్ పై ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. కొత్త సినిమాల్లోనే కాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది అనుపమ. ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి రెడీనే అన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి.

Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

సౌత్ టు నార్త్ ఇండస్ట్రీలను టార్గెట్ చేసిన రష్మిక కూడా స్కిన్ షో విషయంలో తగ్గేదే లే అంటోంది. పుష్ప మూవీలో శ్రీవల్లీగా పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టి క్రష్మికగా మారిపోయింది. పుష్పలో డీగ్లామర్ గా కనిపించినా.. పుష్ప ప్రమోషన్స్ లో మాత్రం గ్లామర్ షోతో అందరికీ పెద్ద షాకిచ్చింది. ఇక ఫోటో షూట్స్ తో పాటూ సోషల్ మీడియాలో సైతం వేరే లెవెల్ లో అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ ఆపరేషన్ ఆకర్షను సక్సెస్ చేస్తుంది.

Senior Heroins: ఏజ్ నాట్ ఇంపార్టెంట్.. కుర్రహీరోలతో సీనియర్ భామల రొమాన్స్!

కనిపించకుండా మాయ చేసేయడం కృతిశెట్టి టాలెంట్. పద్ధతిగా కనిపిస్తూనే యూత్ ని ఎంట్రీ ఇచ్చిన ఉప్పెనతోనే కట్టిపడేసింది. శ్యామ్ సింగ రాయ్ తో లిమిట్ క్రాస్ చేసి నానితో లిప్ లాక్ చేసేసింది. బంగార్రాజులో మాస్ లుక్ లో గ్లామర్ గర్గ్ అట్రాక్ చేసిన కృతి అవసరమైతే హద్దులు దాటడానికి ఇబ్బందేం లేదన్నట్టుంది. అటు పూజా హెగ్డే, నిధి అగర్వాల్ లాంటి వాళ్లు కూడా పాపులారిటీ రావాలంటే ఆమాత్రం చేయక తప్పదనేస్తున్నారు.