Senior Actress: సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన సీనియర్లు.. మళ్ళీ రీఎంట్రీ!

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ని ఏలిన సీనియర్లు ఇప్పుడు మళ్లీ రంగేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తో రెడీ అవుతున్నారు. ఈమధ్య కొత్త కొత్త స్టార్లతో పాటు ఒకప్పుడు టాప్ స్టార్లుగా ఇంపాక్ట్..

Senior Actress: సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన సీనియర్లు.. మళ్ళీ రీఎంట్రీ!

Senior Actress

Senior Actress: ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ని ఏలిన సీనియర్లు ఇప్పుడు మళ్లీ రంగేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ తో రెడీ అవుతున్నారు. ఈమధ్య కొత్త కొత్త స్టార్లతో పాటు ఒకప్పుడు టాప్ స్టార్లుగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సీనియర్ యాక్టర్స్ ని కూడా తెరమీదకి తీసుకొస్తోంది టాలీవుడ్. అలా ఎవర్ యంగ్ ఓల్డ్ స్టార్స్ సరికొత్తగా తెలుగు తెరమీదకు వస్తుండడంతో తెలుగు కళకళలాడిపోతోంది. యంగ్ యాక్టర్స్ తో పాటు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గొప్పనటులుగా తమ సత్తాచాటిన సీనియర్ స్టార్లు.. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగుతెరమీద సందడి చెయ్యబోతోంది నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సీనియర్ హీరోయిన్ అర్చన. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే.. ఈపాటని మర్చిపోవడం తెలుగు ఆడియన్స్ కి అంత ఈజీ కాదు. హీరోయిన్స్ అంటే ఫెయిర్ గా ఉండాలనే సో కాల్డ్ రూల్ ని బ్రేక్ చేసిన ఈ డస్కీ బ్యూటీ సౌత్ లో తన పర్ ఫామెన్స్ తో వండర్స్ క్రియేట్ చేసింది. నిరీక్షణ, భారత్ బంద్ లాంటి ఇంపాక్ట్ మూవీస్ లో నటించిన అర్చన మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ తో కమ్ బ్యాక్ అవుతోంది. జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అలనాటి అందాలతార అర్చన మళ్లీ తన పర్ ఫామెన్స్ తో సందడి చెయ్యబోతున్నారు.

Trolls On Actress: ట్రోల్ అవుతున్న హీరోయిన్స్.. నెటిజన్స్ ఎటాక్!

టాలీవుడ్ స్క్రీన్ మీద సందడి చెయ్యబోతున్న మరో హీరోయిన్ భాగ్యశ్రీ. ప్రేమపావురాలు సినిమాతో ఇండియాని మొత్తం ఊపేసిన ఈ క్యూట్ హీరోయిన్ చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న భాగ్యశ్రీ మార్చి 11న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ లో ప్రభాస్ కు తల్లిగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Actress Workouts: గ్లామర్ క్వీన్స్ వర్కౌట్ పాఠాలు.. ఫ్యాన్స్ ఫిదా!

నార్త్ తో పాటు సౌత్ లో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ రవీనా టాండన్.. గ్యాప్ తర్వాత మల్లీ తెలుగు తెరమీద హడావిడ చెయ్యబోతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2లో ప్రైమ్ మినిస్టర్ గా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తోంది రవీనా. బ్యూటీ విత్ బ్యూటిఫుల్ పర్ ఫామెన్స్ తో సౌత్ ఆడియన్స్ ని మరో సారి ఎంటర్ టైన్ చెయ్యబోతోంది ఈ సీనియర్ స్టార్ హీరోయిన్.

Indian Actress: రెచ్చిపోతాం.. హాలీవుడ్‌లో ముద్దుగుమ్మల బోల్డ్ క్యారెక్టర్స్!

తెలుగు తెరమీద మెరుస్తున్న మరో స్టార్ హీరోయిన్ ఖుష్బూ. సౌత్ లో టాప్ స్టార్ గా వెలిగిన ఈ సీనియర్ హీరోయిన్ ఈ మధ్య అప్పుడప్పుడు కనిపిస్తూ.. అదరగొడుతోంది. అప్పుడెప్పుడో అగ్నాతవాసిలో కనిపించిన ఖుష్బూ.. లేటెస్ట్ గా ఆడవాళ్లూమీకుజోహార్లు సినిమాతో ఫుల్ లెన్త్ ఇంట్రస్టింగ్ రోల్ చేస్తూ.. గ్లామర్ టచ్ ఇస్తున్నారు. గోపీచంద్-దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ కూడా ప్రకటించింది.

Star Actress: ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడైనా ఒకే అంటున్న స్టార్ బ్యూటీస్!

తమిళ్ లో తన కామెడీతో పాటు పరఫామెన్స్ తో అదరగొట్టిన సీనియర్ హీరోయిన్ ఊర్వశి.. తెలుగులో పెద్దగా సినిమాలు చెయ్యలేదు. డబ్బింగ్ సినిమాలతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈ సీనియర్ హీరోయిన్.. ఆ మధ్య ప్రభాస్ జిల్ సినిమాలో పిన్నిగా నటించగా.. ఇప్పుడు శర్వానంద్ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మరోసారి నవ్వించడానికి రెడీ అయ్యారు.

Actress Mohini : నాకు చేతబడి చేసారు.. బాలయ్య హీరోయిన్ మోహిని..

యంగ్ ఏజ్ నుంచి తెలుగు స్క్రీన్ ని హీరోయిన్ గా శాసించిన రాధిక.. ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది. ఆడవాళ్లూ మీకుజోహార్లు సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ చేస్తూ.. ఫాన్స్ కి మరింత దగ్గరవుతున్నారు. మరో సీనియర్ స్టార్ హీరోయిన్ నదియా కూడా తన బ్యూటీ విత్ టాలెంట్ తో టాలీవుడ్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. వరుడు కావలెను లాంటి సినిమాలు చేసిన నదియా మరిన్ని సినిమాలతో రెడీ అవుతున్నారు.

Actress Geetanjali : డేటింగ్ యాప్‌లో ఫొటోలు, సినీ నటి గీతాంజలికి వేధింపులు

మెరుపు తీగ లాగా వచ్చి తెలుగు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్న మరో సీనియర్ హీరోయిన్ అమల. స్టార్ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లోఉన్నప్పుడే నాగార్జునని పెళ్లి చేసకున్న ఈ స్టార్ హీరోయిన్ ఏదో అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా కనిపించి వెళుతున్నారు. కానీ ఈ సారి కాస్త ఎక్కువ స్పేస్ ఉన్న సినిమా చేస్తున్నారు. శర్వానంద్ ఒకేఒక జీవితం సినిమాలో శర్వాకి అమ్మగా కీ రోల్ ప్లే చేస్తోంది సీనియర్ హీరోయిన్ అమల.