Song Promotions: ఒక్కో పాట రిలీజ్.. ప్రమోషన్స్‌లో కొత్త టెక్నిక్!

టాలీవుడ్ లో ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. ఈవెంట్స్ కంటే ముందే.. సాంగ్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు స్టార్లు. సినిమాకు సంబందించి బ్యాక్ టూ బ్యాక్ సాంగ్స్...

Song Promotions: ఒక్కో పాట రిలీజ్.. ప్రమోషన్స్‌లో కొత్త టెక్నిక్!

Song Promotions

Song Promotions: టాలీవుడ్ లో ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. ఈవెంట్స్ కంటే ముందే.. సాంగ్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు స్టార్లు. సినిమాకు సంబందించి బ్యాక్ టూ బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ లో సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. ప్రమోషన్స్ విషయంలో కొత్త టెక్నిక్స్ ఫాలో అవుతూ ఫ్యాన్స్ లో ఈ ఇంట్రస్ట్ ని ఎంగేజ్ చేస్తున్నాయి సినిమాలు.

Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత కాంపిటీషన్ లో సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆడియన్స్ లో సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చెయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు మేకర్స్. ఒకేసారి ఆడియో రిలీజ్ చెయ్యకుండా వన్ బై వన్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. సోషల్ మీడియాలో సినిమా మీదహైప్ తెచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన రాధేశ్యామ్ ఇదే రూట్ ని ఫాలో అవుతూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తోంది.

Pushpa: ఇక్కడ ప్రభాస్.. అక్కడ సల్మాన్.. బన్నీ కోసం ఈ ఇద్దరూ!

ట్రిపుల్ ఆర్ అయితే చాలా ప్లాన్డ్ గా పాటల విషయంలో ప్రమోషన్లు చేస్తోంది. ప్రమోషన్ల విషయంలో సెపరేట్ స్ట్రాటజీ మెయింటెన్ చేసే రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా వెళ్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న సినిమాకి సంబందించి సాంగ్స్ అన్నీ అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. మొన్నీమధ్య రిలీజ్ అయిన నాటు నాటు మాస్ సాంగ్ 75 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి 8 కోట్లకు రీచ్ అవుతోంది.

Akhanda: బీబీ3.. హిట్ అవుతుందా? తేడా కొడుతుందా?

భీమ్లానాయక్ అయితే ఈ లిస్ట్ లో ఫస్టు ఉంది. సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ సినిమా టీజర్స్ సంగతి పక్కన పెడితే.. సాంగ్స్ తోనే సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలకుండే ఇంపార్టెన్స్ తో పాటు ఆపాటల్ని ఫ్యాన్స్ కి రీచ్ అయ్యేలా ఆడియన్స్ కి నెక్ట్ చేస్తోంది టీమ్. భీమ్లానాయక్ నుంచి పాట రిలీజ్ అవుతుందంటే.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే రేంజ్ కి తీసుకొచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారు.

Bigg Boss 5: హౌస్‌లో ఓ కంటెస్టెంట్‌కి అన్యాయం.. రవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

పుష్ప మూవీ కూడా ప్రమోషన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ నుంచి స్టెప్ బై స్టెప్ సాంగ్స్ మాంచి టైమ్ లో రిలీజ్ చేస్తోంది టీమ్. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి పాట.. సినిమాకు యాడెడ్ ఎట్రాక్షన్ అనడం కంటే.. ఆ రేంజ్ లో ఆడియన్స్ కి రీచ్ చేశారు బన్నీ. సినిమా ఎంత గ్రాండ్ గా ఉన్నా, ఎంత సక్సెస్ అయ్యే సబ్జెక్ట్ అయినా సరే .. ముందు ఆడియన్స్ ని ఎంగేజ్ చేసిది సాంగ్స్. అందుకే ఈ సింపుల్ టెక్నిక్స్ తో టైమింగ్ చూసుకుని సాంగ్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ కి సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు స్టార్లు.