Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

స్టార్ హీరోలకే కాదు.. 2021లో సినిమాలు పెద్దగా సక్సెస్ కాని హీరోలకు కూడా 2022 కీలకం కాబోతోంది. స్టార్ హీరోల మధ్య, పాన్ ఇండియా సినిమాల మధ్య తామున్నామని ప్రూవ్ చేస్కోవాలంటే మంచి..

Telugu Young Hero’s: ఒక్క హిట్ ప్లీజ్.. యంగ్ హీరోలకు క్రూషియల్ ఏడాది!

Telugu Young Hero's

Telugu Young Hero’s: స్టార్ హీరోలకే కాదు.. 2021లో సినిమాలు పెద్దగా సక్సెస్ కాని హీరోలకు కూడా 2022 కీలకం కాబోతోంది. స్టార్ హీరోల మధ్య, పాన్ ఇండియా సినిమాల మధ్య తామున్నామని ప్రూవ్ చేస్కోవాలంటే మంచి సక్సెస్ కొట్టాల్సి ఉంటుంది. అలాంటి సక్సెస్ కోసం, అలాంటి సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు హీరోలు. టాప్ హీరోలకే కాకుండా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోలకు కూడా 2022 క్రూషియల్ కాబోతోంది. టాప్ హీరోలకు ఒక సినిమా సక్సెస్ కాకపోయినా.. స్టార్ డమ్ లో పెద్దగా తేడా ఉండదు. కానీ అప్ కమింగ్, మిడిల్ రేంజ్ హీరోలకు మాత్రం ఒక్క హిట్ చాలా వాల్యుబుల్. అందుకే సినిమా రిలీజ్ కోసం సక్సెస్ కోసంవెయిట్ చేస్తుంటారు.

RRR Postpone: టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం.. వుయ్ వాంట్ అఫీషియల్ కన్ఫర్మేషన్

మల్టీ టాలెంటెడ్ హీరో రానాకి 2022 చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ సినిమాలు చేస్తున్న రానా అరణ్యతో 2021లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. కానీ 2022లో మాత్రం.. విరాటపర్వం, భీమ్లానాయక్ తో సక్సెస్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఎంత పొటెన్షియాలిటీ ఉన్నా సక్సెస్ కొట్టలేకపోతున్నారు శర్వానంద్. 2021లో వచ్చిన శ్రీకారం, మహాసముద్రం శర్వానంద్ కి కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అందుకే 2022లో తన అప్ కమింగ్ సినిమాల మీద ఆశలు పెట్టుకున్నారు. ఒకే ఒకజీవితం, ఆడవాళ్లూ మీకు జోహార్లు లాంటి సినిమాలతో 2022 శర్వానంద్ కి కీలకం కాబోతోంది.

Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!

మరో మిడిల్ రేంజ్ హీరో నితిన్ కి కూడా 2022 చాలా ఇంపార్టెంట్. 2021లో రిలీజ్ అయిన చెక్ మేట్, రంగ్ దే, మ్యాస్ట్రో సినిమాలతో మిక్స్ డ్ రిజల్ట్ సాధించిన నితిన్.. కొత్త సంవత్సరంలో ఎలా అయినా గట్టి హిట్ కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. మాచర్ల నియోజకవర్గం అనే పవర్ ఫుల్ పొలిటికల్ సబ్జెక్ట్ తో 2022లో తన లక్ చెక్ చేసుకోడానికి ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు నితిన్. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి 2021 పెద్దగా కలిసి రాలేదు. పర్సనల్ గా జరిగిన యాక్సిడెంట్ తో పాటు ప్రొఫెషనల్ గా కూడా రిలీజ్ అయిన రిపబ్లిక్ మూవీ మంచి టాక్ తెచ్చుకున్నా.. కమర్షియల్ గా అనుకున్నంత హిట్ కాకపోవడంతో 2022 మీదే ఆశలుపెట్టుకున్నాడు సాయిధరమ్ తేజ్. శ్రీకార్తిక్ తో చేస్తున్న సినిమాతో పాటు సంపత్ నందితో చేస్తున్న మరో మూవీతో 2022 సాయి కెరీర్ కి కీలకం కాబోతోంది.

Telugu Star Hero’s: సక్సెస్ కోసం ఎదురుచూపులు.. కోటి ఆశలతో కొత్త ఏడాది!

ఎనర్జిటిక్ హీరో రామ్ కి కూడా 2021 అంతగా కలిసి రాలేదు. అందుకే 2022 సక్సెస్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నాడు. 2021లో రిలీజ్ అయిన రెడ్ మూవీ అస్సలు అడ్రస్ లేకపోవడంతో ఇప్పుడు లింగుస్వామితో చేస్తున్న మూవీ 2022 లో రిలీజ్ కి రెడీ అవుతుందడడంతో కెరీర్ లో హిట్ ఇస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు రామ్. 2022 నాగశౌర్యకి కూడా చాలా క్రూషియల్. 2021లో వరుడు కావలెను తో పర్వాలేదనిపించినా.. ఎన్నో ఆశలతో రిలీజ్ చేసిన లక్ష్య మాత్రం డిజాస్టర్ అయ్యింది. సో.. హీరోగా సస్టెయిన్ అవ్వాలంటే.. 2022లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలతో హిట్ కొట్టాల్సిందే.