Aha : ఆహాలో మరో డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అరుళ్‌నిధి స్టాలిన్ ‘రేయికి వేయి కళ్లు’..

తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ‘రేయికి వేయి కళ్లు’ పేరిట ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలోకి........

Aha : ఆహాలో మరో డబ్బింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అరుళ్‌నిధి స్టాలిన్ ‘రేయికి వేయి కళ్లు’..

one more dubbing suspense movie reyiki veyi kallu in aha

 

Aha :  ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా కూడా ప్రేక్షకులందరూ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. ఓటీటీలతో భాషాబేధం లేకుండా పోయింది. ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ఇరువక్కు ఆయిరమ్ కంగళ్’ అనే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ‘రేయికి వేయి కళ్లు’ పేరిట ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలోకి తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో మంచి విజయాలు సాధించిన అరుళ్‌నిధి స్టాలిన్. రేయికి వేయి కళ్లు సినిమాతో మరోసారి ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా యాభై రోజులు ఆడింది. ప్రేక్షుకులు, విమర్శకులు అందరూ కూడా సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది.

SV Ramanan : మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం..

‘రేయికి వేయి కళ్లు’ సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధానబలం. రివర్స్ ఆర్డర్‌ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఒక్కోసారి ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమా గుర్తుకు వస్తుంటుంది. డైరెక్టర్ ము.మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు పకడ్బంధీగా రాసుకున్నారు. ‘రేయికి వేయి కళ్లు’ కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్‌ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించకుండా కథని నడిపించారు.