Jersey : హిందీ జెర్సీకి దెబ్బ మీద దెబ్బ.. అసహనం వ్యక్తం చేస్తున్న షాహిద్ కపూర్..

జెర్సీ సినిమాకి మొదటి నుంచి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాకి మొదట కరోనా లాక్ డౌన్ రాగా షూటింగ్ మధ్యలో ఆగింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్............

Jersey : హిందీ జెర్సీకి దెబ్బ మీద దెబ్బ.. అసహనం వ్యక్తం చేస్తున్న షాహిద్ కపూర్..

Jersey

Shahid Kapoor :  గత కొద్ది కాలంగా బాలీవుడ్ ని సౌత్ సినిమాలు శాసిస్తున్నాయి. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవ్వడమే కాక ఇక్కడ హిట్ అయిన సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోలు తెలుగు, సౌత్ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాలని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇలా రీమేక్ అవుతున్న సినిమాల్లో జెర్సీ కూడా ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెలుగులో వచ్చిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఎమోషనల్ గా అందరికి కనెక్ట్ అయింది. నేషనల్ అవార్డు కూడా సాధించింది ఈ సినిమా. నాని కెరీర్ లో బెస్ట్ గా ఈ సినిమా నిలిచింది.

 

ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేశారు. ఇదే డైరెక్టర్ తో తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, నాగవంశీలు జెర్సీ సినిమాని హిందీలో షాహిద్ కపూర్ తో నిర్మించారు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాకి మొదట కరోనా లాక్ డౌన్ రాగా షూటింగ్ మధ్యలో ఆగింది. ఆ తర్వాత కరోనా సెకండ్ లాక్ డౌన్ వచ్చి సినిమా రిలీజ్ ఆపేసింది. సంక్రాంతి సమయంలో ఈ సినిమా వద్దామని అనుకున్న కరోనా భయంతో థియేటర్స్ క్లోజ్ చేశారు, దీంతో అప్పుడు కూడా ఈ సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చి జెర్సీని వాయిదా పడేలా చేసింది. ఇక ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని కెజిఎఫ్ 2 సినిమా రావడంతో మళ్ళీ వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Vijay : బీస్ట్ సినిమా చూడండి.. లీటర్ పెట్రోల్ ఫ్రీగా పొందండి..

ఇలా వరుసగా సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లని రెండు సార్లు చేశారు. మళ్ళీ ప్రమోషన్స్ పై బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు,. గతంలోనే షాహిద్ సినిమా ఇలా వాయిదా పడుతున్నందుకు మీడియా ముందే అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఒకవేళ మళ్ళీ ప్రమోషన్స్ నిర్వహించినా షాహిద్ ప్రమోషన్స్ కి వచ్చేలా కనపడటం లేదు. అంతే కాక ఒక రీమేక్ సినిమా ఇన్ని సార్లు వాయిదా పడటంతో హిందీ ప్రేక్షకులకి కూడా దీనిపై ఆసక్తి తగ్గిపోయింది. ఈ సినిమా ఎలాగో సౌత్ లో రిలీజు అయ్యే అవకాశం లేదు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి హిందీ జెర్సీ సినిమాకి.

Seetha Ramam : మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్.. రిస్క్ చేస్తున్న దుల్కర్, హను..

తాజాగా ఈ సినిమాకి మరో సమస్య ఎదురైంది. ఈ సినిమా కథకు సంబంధించిన కాపీరైట్స్‌ విషయంలో బాలీవుడ్ రచయిత రూపేశ్‌ జైశ్వల్‌ కోర్టును ఆశ్రయించారు. 2007లోనే ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ను ఫిలిం రైటర్స్ అసోసియేషన్‌లో ‘ది వాల్’ అనే స్క్రిప్ట్‌ పేరుతో రిజిస్టర్ చేయించానని తెలిపారు. నా కథలో ఎన్నో మార్పులు చేశారని, నాకు తెలియకుండానే స్క్రిప్ట్‌ను తీసుకున్నారని కోర్టులో దావా వేశారు.హిందీ జెర్సీ సినిమాని థియేటర్‌లలో లేక వేరే ఏ ఓటీటీలలో కూడా రిలీజ్ చేయకూడదని కోర్టుని కోరారు. కనీసం ఈ తీర్పు వచ్చేదాకా అయినా సినిమా విడుదల ఆపాలని అన్నారు. మరి దీనిపై కోర్టు ఏం తీర్పు ఇస్తుందో, జెర్సీ సినిమా రిలీజ్ అవుతుందా చూడాలి.