Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్.. | One more leak from RC15 charan dancing on vizag roads

Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..

వైజాగ్ రోడ్ల మీద చరణ్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కలిసి చిందేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది లవ్ సాంగ్ కి సంబంధించిన.............

Ram Charan : వైజాగ్‌లో చిందేస్తున్న చరణ్.. RC15 నుంచి మరో లీక్..

Ram Charan :  ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో మెప్పించిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 షూట్ లో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా పంజాబ్, ముంబై, పూణే, రాజమండ్రి లొకేషన్స్ లో షూటింగ్స్ జరుపుకుంది. రెండు పాటలు కూడా షూటింగ్ అయిపోయాయి. ప్రస్తుతం వైజాగ్ లో గత మూడు రోజుల నుంచి ఈ సినిమాని షూట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. శంకర్ షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నా ఏదో ఒక రకంగా ఈ సినిమా నుంచి పిక్స్ కానీ, షూటింగ్ వీడియో బైట్స్ కానీ లీక్ అవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్, రాజమండ్రి పరిసరాలలో షూటింగ్ జరిగినప్పుడు పిక్స్ లీక్ అయ్యాయి. తాజాగా వైజాగ్ లో ఓ సాంగ్ షూట్ చేస్తుండగా రోడ్ మీద రామ్ చరణ్ డాన్స్ చేస్తున్న వీడియోని లీక్ చేశారు.

Sarkaru Vaari Paata : థియేటర్లో మహేష్ ఫ్యాన్స్ హంగామా.. థియేటర్ యాజమాన్యంతో గొడవ..

వైజాగ్ రోడ్ల మీద చరణ్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కలిసి చిందేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది లవ్ సాంగ్ కి సంబంధించిన వీడియో అని తెలుస్తుంది. చరణ్ ఫాన్స్ ఇందులో డాన్స్ చూసి రామ్ చరణ్ అదరగొట్టేస్తున్నాడు అంటూ ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. అటు చిత్ర యూనిట్ ఏమో ఈ లీకుల బెడద ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు.

×