Evam Jagath : రూపాయికే సినిమా.. మంచి సినిమా కోసం కొత్త దర్శకుడి తాపత్రయం

తాజాగా ఓ కొత్త దర్శకుడు రూపాయికే తన సినిమా చూపిస్తా అంటున్నాడు. 'ఏవమ్ జగత్' అనే సినిమా తీసిన దర్శకుడు తన సినిమాకు రూపాయి టికెట్ ధరగా నిర్ణయించాడు. రైతుల కోసం వ్యవసాయం నేపథ్యంలో....

Evam Jagath : రూపాయికే సినిమా.. మంచి సినిమా కోసం కొత్త దర్శకుడి తాపత్రయం

Evam Jagath

Evam Jagath :   కరోనా రావడంతో సినిమా చూసే పద్ధతులు చాలా వరకు మారాయి. ఒకప్పుడు కేవలం థియేటర్స్ కి వెళ్లి మాత్రమే సినిమాలు చూసేవారు. కరోనా తర్వాత ఓటీటీలతో పాటు ప్రైవేట్ సైట్స్ లో సినిమా రిలీజ్ చేయడం కూడా జరిగాయి. సొంత వెబ్ సైట్స్ లో తమ సినిమాని రిలీజ్ చేయడం ఆర్జీవీ మొదలు పెట్టిన తర్వాత చాలా మంది చిన్న సినిమా వాళ్ళు ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారు. చిన్న సినిమాలకి థియేటర్స్ కి వెళ్లే అంత బడ్జెట్ ఉండకపోవడంతో ఓటీటీలు కూడా సినిమాని తీసుకోకపోతే సొంత సైట్స్ లో సినిమాని రిలీజ్ చేసి ప్రమోషన్ చేసుకొని వాళ్ళకి నచ్చిన టికెట్ ప్రైస్ పెట్టుకుంటున్నారు.

తాజాగా ఓ కొత్త దర్శకుడు రూపాయికే తన సినిమా చూపిస్తా అంటున్నాడు. ‘ఏవమ్ జగత్’ అనే సినిమా తీసిన దర్శకుడు తన సినిమాకు రూపాయి టికెట్ ధరగా నిర్ణయించాడు. రైతుల కోసం వ్యవసాయం నేపథ్యంలో దినేష్ నర్రా అనే యువ దర్శకుడు తెరకెక్కించిన మూవీ ‘ఏవమ్ జగత్’. మార్చ్ మూవీస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముణిరత్నం నాయుడు ఈసినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రైతుల సినిమా ‘ఏవమ్ జగత్’ జనవరి 16న సాయంత్రం 6 గంటలకు ఏవమ్ జగత్ డాట్ కామ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సైట్ ను డైరెక్ట్ గా ఓపెన్ చేసి సైట్ లోకి వెళ్ళి రూపాయి కడితే సినిమా లింక్ వస్తుంది. అప్పుడు సినిమాను చూడవచ్చు.

Roja : రోజా సంక్రాంతి సంబరాలు

సేంద్రీయ వ్యవసాయం, పల్లె వాతావరణం గురించి, ఈ కాలంలో రసాయనాలు వాడుతూ కృత్రిమ వ్యవసాయం చేస్తే భవిషత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోంటారు, మనకు కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది సినిమా కాన్సెప్ట్ అని దర్శకుడు తెలిపారు.